నేటి గద్దర్ వెంకటాపురం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం వాగు ప్రాజెక్టులో
ఉచిత చేప పిల్లల పెంపకం తో గిరిజన మత్స్య కారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహోన్నతమైన కార్యక్రమానికి ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు,
బిజెపి పార్టీ గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధబోయిన, సురేందర్ పాల్గొని ప్రసంగించారు. వెంకటాపూరం మండలం పాలెం వాగు ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో 1లక్షల 82 వేల 250 చేప పిల్లలు, 3 రకాల చేపలు 1. కట్ల – 72900 , 2. రవ్వ – 91125 3. మెరిగే – 18225 చేప పిల్లలను విడుదల చేయడం జరుతుందన్నారు. ఈ రోజు సుమారుగా 182250 చేప పిల్లలను, రాష్ట్ర ప్రభుత్వం 100 % రాయితి తో ఉచిత చేప పిల్లల పెంపకం తో ఆర్థికంగా అభివృద్ధి ఎదుగుదలకు సహాయపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మార్వో, లక్ష్మిరాజయ్య, ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కుమార్,రమేష్ జిల్లా మత్స్య క్షేత్ర అధికారి , పాలెం మత్స్య సంఘం అధ్యక్షులు సగలం ఆదినారాయణ కేశరావు , ఆలం భాస్కర్ ఆలం శ్రీను, కొమరం రామారావు, మత్స్య శాఖ సిబ్బంది కృష్ణ మౌనిక, నిహారిక తదితరులు పాల్గొన్నారు.