నేటి గదర్ న్యూస్ నవంబర్ 14: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
వైరా :ఖమ్మం జిల్లా వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన జోనల్ లెవెల్ స్పోర్ట్స్ విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని నింపాయి ఈనెల 11న ప్రారంభమైన ఈ క్రీడలు 14వ తేదీ గురువారం తో ముగిశాయి. చివరి రోజు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి సమత అధ్యక్షతన ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ప్రతి కాంపిటీషన్లో క్రీడా స్ఫూర్తితో పాల్గొని విజయం కోసం దీక్షతో కృషి చేయాలన్నారు. క్రీడలు మానసికోల్లాసాన్ని, శారీరకదృఢత్వాన్ని ఇస్తాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు కూడా అత్యంత అవసరమైనవిగా భావించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ఉద్బోధించారు. కార్యక్రమంలో ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గత నాలుగు రోజులుగా నిర్వహించిన పలు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, మాజీ మార్క్పైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు, రాంపూడి రోశయ్య, వడ్డే నారాయణరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిడికే రత్నం, దార్నా రాజశేఖర్, పాలేటి నరసింహారావు, మచ్చ వెంకటేశ్వరరావు(బుజ్జి), మట్టురి కృష్ణారావు, సూర్యదేవర శ్రీధర్, పినపాక మాజీ సర్పంచ్ రాజు, సత్తెనపల్లి నరసింహారావు, తెళ్ళురి వీరయ్య, షేక్ రహీమ్, వేల్పుల భరత్, మరియు కళాశాల సిబ్బంది సి ఓ రాజ్యలక్ష్మి ,కళాశాల వైస్ ప్రిన్సిపల్ శివకుమారి, సీనియర్ ప్రిన్సిపల్స్ చావా జ్యోతి, లిల్లీ, ఎం పద్మావతి, గంటేల సునీత, పివి పద్మావతి, టి. విజయదుర్గ,స్థానిక గురుకుల సూపరింటెండెంట్ టి.సాయి కిరణ్, ఎండి. షాకిర బేగం, పి భాస్కర్ , డి. రామకృష్ణ, పి. వాసవి, బి. వస్రం, పి. సరిత, షేక్ సాహిని సుల్తానా, కుసుమ, నాగేశ్వరి, విజయనిర్మల, ఈశ్వరి, శ్వేత, రోహిణి, స్వప్న, దేవకి, రత్నకుమారి ,రాణి, దుర్గ, విజయలక్ష్మి, స్రవంతి,మీనా కుమారి, సరళా దేవి, నీలిమ,కె.ప్రమీల,బాలరాజు, వైరా మున్సిపల్ కమిషనర్ చింత వేణు, తదితరులు పాల్గొన్నారు.