రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 14:-జాతీయ ఆహార భద్రత పథకం నూనె గింజలులో భాగంగా రైతులకు ఉచితంగా పొద్దుతిరుగుడు విత్తనాల రెండు కేజీల చిరు సంచులను అందజేయడం జరిగిందని రామాయంపేట ఇంచార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ అన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నూనె గింజల పంటల ద్వారా పండించిన ఉత్పత్తులకు జాతీయంగా మరి అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరి తక్కువ కాలవ్యవధిలో తక్కువ నీటిని వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించడానికి మరియు వరికి ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు పంటను ప్రోత్సహించే విధంగా రైతులకు ఉచితంగా రామాయంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో నిజాంపేట, చేగుంట,రామాయంపేట మండలాలకు చెందిన120 ఎకరాలకు సరిపోను పొద్దుతిరుగుడు విత్తన చిరు సంచులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.పొద్దు తిరుగుడు పంటలో తిల్హాన్ టెక్ సన్ హెచ్ వన్ అనే పొద్దు తిరుగుడు అధిక దిగుబడినిచ్చే వంగడం యొక్క దిగుబడి క్షేత్రస్థాయిలో ఏ విధంగా వస్తుందో అంచనా వేయడానికి రైతులకు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ వంగడం యొక్క దిగుబడి మరియు చీడపీడల్ని తట్టుకునే గుణాలను మరియు నీటి ఎద్దడిని తట్టుకునే గుణాలను అంచనా వేసి క్షేత్రస్థాయిలో దీని దిగుబడి రైతు స్థాయిలో సంతృప్తికరంగా ఉన్నట్లయితే వచ్చే సీజన్లో మరింత మంది రైతులకు ఈ రకాన్ని చేరువలోకి తేవడంలో భాగంగా రైతులకు చిరుసంచుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు.ఈ రకం యొక్క క్షేత్రస్థాయి ఫలితాలను ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణాధికారులు సాయికృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.