మెదక్ న్యూస్ నేటి గద్దర్ నవంబర్ 14.
మెదక్ జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల మరియు పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాలలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సిసి కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలి
సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలి
ప్రతి పోలీస్ అధికారి తమ విదుల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
న్యాయ స్థానాలలో కేసులలో ఉన్న నిందితులకు తప్పకుండా శిక్షలు పడేందుకు కృషి చేయాలి, తద్వారా ప్రజలకు పోలీస్ వ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుంది
నాన్ బేయిలబుల్ వారెంట్ త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలి
ప్రజల సేఫ్టీ సెక్యూరిటీ చాలా ముఖ్యం,
పెండింగ్ కేసులపై నెల వారి సమీక్ష సమావేశం
జిల్లా ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా సిబ్బందితో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేసులు పెండింగ్ లో ఉండుటకు గల ముఖ్య కారణాలను ప్రస్తుతము అట్టి కేసుల యొక్క పరిస్థితులను తెలుసుకొని చాలా కాలము నుండి పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని, పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ FSL రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి ప్రతి అధికారి ఛాలెంజ్ గా తీసుకొని కేసులు చేదించాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని గ్రామాల మరియు పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాలలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ నేను సైతం ద్వారా అన్ని గ్రామాలలో,పట్టణాల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, మరియు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపినారు. నేరాలను అదుపు చేయడం, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఎన్నో దొంగతనాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొని కేసులు చేధించడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పని చేస్తుందని అందువల్ల సిసి కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు. అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాల్లో ప్రదాన కూడల్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే పోక్సో కేసులలో, ఎస్.సి., ఎస్.టి. కేసులల్లో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తును చేసి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా చూడాలని, చట్టముపై సమాజములో అవగాహన కల్పించాలని, ప్రతి యూనిట్ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ప్రత్యేక ప్రణాళికతో పెండింగ్ కేసులను తగ్గించాలని బ్ల్యూ కొల్ట్స్, పాట్రో మొబైల్ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం చాలా ముఖ్యం అని అన్నారు. రిసెప్షన్, ఎస్.హెచ్.ఒ, కమ్యూనిటి పోలిసింగ్ ఇలా పోలీసు స్టేషన్ కి సంబందించిన అన్ని విభాగాల ఫంక్షనల్ వర్టికల్స్ గురించి వారి యొక్క పనితీరు గురించి అడిగి తెలుసుకొని స్టేషన్లోని వివిధ వర్టికల్స్ లో సిబ్బంది పోటీతత్వంతో పనిచేసి మెరుగైన అభివృద్ధి సాధించాలని తెలిపారు. నేర విచారణ అధికారి కేసులలో శిక్షలు పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని, కోర్టులో ట్రయిల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు సాక్షులను మోటివేట్ చేయాలని సూచించారు. అలాగే సమన్స్, వారంట్స్ ఎగ్సిక్యూటివ్ చేయాలని, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి దరఖాస్తును ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ రిపోర్టును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్నిస్థాయిల అధికారుల పని చేయాలన్నారు.
అలాగే వివిద కేసుల చెదనలో మంచి ప్రతిభ కనపరచి నెరస్థులను పట్టుకున్న సిబ్బందిని ఏ సందర్భంగా జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. అభినందించి రివార్డ్ లతో సత్కరించడం జరిగినది. ఇక ముందు కూడా ఇలానే పని చేసి జిల్లా కి మంచి పేరు తేవాలని అన్నారు.
అధికారులు సిబ్బంది వివరాలు
రామాయంపేట సిఐ. వెంకటరాజా గౌడ్
శంకరంపేట ఎస్.ఐ శ్రీ. నారాయణ
తూప్రాన్ సిఐ .రంగ కృష్ణ
మనోహరాబాద్ ఎస్.ఐ.సుభాష్ గౌడ్
నర్సాపూర్ సిఐ .జాన్ రెడ్డి
నర్సాపూర్ ఎస్.ఐ శ్రీ.లింగం
కానిస్టేబుళ్లు
పి.ముకుందం, కె.శ్రీనివాస్ రాథోడ్ , పి.ప్రసాద్ గౌడ్, మనోహరాబాద్ పిఎస్ , బి.నర్సిములు, జి.రాజు, సత్యం నాయుడు తూప్రాన్ పిఎస్ , భాస్కర్ చేగుంట పి.ఎస్, ఉపేందర్, శ్రీకాంత్ , నర్సాపూర్ పిఎస్, రాజశేఖర్ శంకరంపేట పిఎస్, ప్రశాంత్ పిఎస్ వెల్దుర్తి.
ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్. ఎస్. మహేందర్ , తూప్రాన్ డి.ఎస్.పి . వెంకట రెడ్డి , మెదక్ డి.ఎస్.పి .ప్రసన్న కుమార్, సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ. సుభాష్ చంద్ర బోస్ , ఎస్బీ సిఐ. సందీప్ రెడ్డి, డి.సి.ఆర్.బి. సి.ఐ.మధుసూదన్ గౌడ్ , జిల్లా సి.ఐ.లు, ఎస్.ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.