రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 16:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 19వ తేదీ ఏడుపాయల నుండి మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర సందర్భంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించిన నుండి రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు.గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసిందని తెలిపారు.రాష్ట్రంలో రైతులకు రైతుబంధు లేకుండా పోయిందని చివరికి రైతులకు రైతు భరోసా లేకుండా పోయి కన్నీళ్లు మిగిలాయని ఆమె పేర్కొన్నారు.రైతుల ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతన్నలు రోడ్డు ఎక్కుతున్నారని ఆమె వాపోయారు.రైతులకు ధాన్యం కొనుగోలు చేసి న్యాయం చేసేంతవరకు తాము రైతుల పక్షంగా పోరాటం చేస్తామని ఆమె వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.