ఏజెన్సీ లో గిరిజనేతరుల వలసలు అరికట్టేదేవారు.!(GSP)అధ్యక్షులు. పాయం
నేటి గదర్ ప్రతినిధి చర్ల :వరప్రసాద్
షెడ్యూల్డ్ ప్రాంతాలలోకి వలసలను నిరోధించడానికి వలస నిరోధక చట్టాన్ని చట్టసభల్లో రూపొందించాలి.
భద్రాచలం శనివారం నాడు గొల్లగట్ట రోడ్డులో గడ్డం వెంకన్న బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలోకి గిరిజనేతరులు ఆదివాసీల భూభాగంలోకి ప్రవేశించి చిన్న చిన్న వ్యాపారాలు కొనసాగిస్తు ఆదివాసుల భూములను కొనుగోలు చేస్తూ ఆదివాసుల అస్తిత్వానికే పేను ప్రమాదం తీసుకొచ్చే కుట్రలు చేస్తున్నారని ఏజెన్సీ ప్రాంతాలలోకి గిరిజనేతర వలసలను అరికట్టాలంటే చట్టసభల్లో వలస నిరోధక చట్టాన్ని రూపొందించాలని దీనికి ఆదివాసి ఎమ్మెల్యేలు శ్రద్ధ వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు 1976 లో కలిపిన లంబాడాల తోనే ఆదివాసులకు తీవ్రమైన నష్టం జరుగుతోందని మైదాన ప్రాంత జిల్లాల నుండి వలస వచ్చిన గౌడ్ లు కూడా మమ్మల్ని ఎస్టీ జాబి తాలలో చేర్చి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరడం రాజ్యాంగ విరుద్ధమని తెలుసుకోవాలని హితవు పలికారు ఒకపక్క లంబాడోళ్ళతో ఉద్యోగ ఉపాధి రాజకీయ రిజర్వేషన్లతో పాటు యూనివర్సిటీలలో మరియు గురుకులాల ఏకలవ్య లాంటి రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా ఆదివాసులకు దక్కని సీట్ల వైనం లంబాడా సామాజిక వర్గం తోటే వైర్యం నడుస్తుంటే కొత్తగా గౌడ్స్ వడ్డెర వాళ్ళు మమ్మల్ని కూడా ఎస్టీ జాబితాలో చేర్చండి అని అడగడం నీతిమాలిన చర్య అని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బోడికసాయికిరణ్ వాగె సుధాకర్ కుంజా చంటి ఉ యిక సురేష్ పాల్గొన్నారు