చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
చర్ల – అంబేద్కర్ నగర్ కు చెందిన కొడిపె రాము – స్వాతి రోజువారీ కూలీలు దంపతుల కుమారుడైన ధనుష్ వయస్సు – 4 సం” కు డెంగ్యూ వ్యాధి సోకి, బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ రావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఆసుపత్రి ఖర్చులు, ప్రతీరోజూ వాడాల్సిన మందులు విపరీతంగా ఉండడం, రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిల్లో. ఆర్థిక సహాయం కోసం మీకోసం మేమున్నాం సంస్థను ఆశ్రయించడం జరిగింది. ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి,మీకోసం మేమున్నాం టీం తరఫున ఫండ్ రైజింగ్ పోస్టు పెట్టి, పలువురు దాతల నుంచి సేకరించిన 20,000/- అక్షరాల ఇరవై వేల రూపాయలను ఈరోజు ఉదయం 11 గంటలకు కుర్సం బాబూరావు చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ.పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి సహాయం అందిస్తారని చూడకుండా, మనమే తలా ఓ చేయి వేస్తే – ఎంతటి కష్టాన్నైనా అవలీలగా అధిగమించ వచ్చని, అందులో భాగంగానే ఈ ఫండ్ రైజింగ్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చామని తెలిపారు… ఈ కార్యక్రమంలో ముమ్మనేని అరవింద్, దొడ్డి సూరిబాబు, దొడ్డ ప్రభుదాస్, నగేష్ శెట్టి, కవ్వాల రాము, కోల్లపూడి సందీప్, శ్యామల అశోక్, పంజా రాజు, కట్టా అమ్మాజి తదితరులు పాల్గొన్నారు.