రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 16:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం, కోనాపూర్ గ్రామాలలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ప్రగతి ధర్మారంలోని వెంకటేశ్వర రైస్ మిల్లును సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లర్లు రైతులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన అన్లోడింగ్ చేసి లారీలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు పంపించాలన్నారు.రైతులకు ఎలాంటి అసాకర్యాలు కలగకుండా చూసుకోవాలన్నారు. అనంతరం ప్రగతి ధర్మారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు.అలాగే కోనాపూర్ గ్రామంలోని రైస్ మిల్లును సందర్శించి రైస్ మిల్లర్ ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, రామాయంపేట సిఐ.వెంకట రాజాగౌడ్, ఎస్సై బాలరాజ్ , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.