రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 16:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాన్యమును చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుందని రైతులు ఎవరు కూడా అప నమ్మకం పెట్టుకోవద్దని మాట ఇచ్చిన ప్రకారము తీసుకుంటుందని అన్నారు.మన భారత దేశంలో రికార్డు స్థాయిలో పంట పండించడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగిందన్నారు. అదే కాకుండా రైతులకు సన్న వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తుందని,7 వేల మెట్రిక్ టన్నుల పై చిలుకు ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు.ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు జరిగాయని దాంతో రైస్ మిల్లర్లకు ఇబ్బందిగా ఉండి ధాన్యం కొనుగోలు ఆగుతున్నాయి. ప్రభుత్వం గోదాములలో దాన్యం పెట్టడానికి రెడీగా ఉందన్నారు. పాత బకాయిలు పాత డ్యూలు ఉన్నాయన్నారు.రైతులను కేటీఆర్ హరీష్ రావులు కొంతమందిని రెచ్చగొట్టి రోడ్డెక్కి విధంగా చేస్తున్నారని వారిని నమ్మవద్దన్నారు.అదే మొన్న ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జీరో అయిందని, భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందన్నారు. అదే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే వద్దను తేమశాతంతో ఇబ్బందికి గురి చేస్తుందన్నారు. గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేయని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. భూములు విషయంలో మన కొంతమందిని రెచ్చగొట్టి వికారాబాద్ కలెక్టర్ పై దాడిలో కేటీఆర్ ప్రమేయం ఉందన్నారు.బిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులకు త్వరలోనే వారికి శిక్ష తప్పదన్నారు.ప్రజలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ముందుకు నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా కన్వీనర్ విప్లవ్ కుమార్, కోనాపూర్ గ్రామ అధ్యక్షుడు మామిడి సిద్ధ రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తొనిగండ్ల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.