రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 17:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ముదిరాజ్ సంఘం ఒకటో నంబర్ బేడ నూతన అధ్యక్షునిగా దేవుని రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామాయంపేట పట్టణంలోని దుర్గమ్మ గుడి వద్ద కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు.కోశాధికారిగా చల్మెడ శ్రీనివాస్,రైటర్లుగా పెంట మీది శ్రీనివాస్,దేవుని పవన్ కుమార్,కార్యవర్గ సభ్యులుగా దాకి శ్రీనివాస్, గంగేరి పోచయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా దేవుని రవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.సభ్యులకు ఎవరికి ఏ సమస్య వచ్చినా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 139