*కొత్తగూడెం లీగల్ ::*
*ఫోక్సో కేసులో వ్యక్తి కి ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్ఎసి ఫో క్సో స్పెషల్ కోర్టు) పాటిల్ వసంత్ తీర్పు చెప్పారు.*
*అశ్వాపురం గ్రామానికి చెందిన 12 సంవత్సరంల మైనర్ బాలిక ను తన ఇంటి సమీపంలోని గల సుగ్గల ఉమామహేశ్వరరావు @ నాని, తాను పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లే క్రమంలో 22 అక్టోబర్ 27న బాధితురాలైన మైనర్ బాలికకు ఉమామహేశ్వరరావు టెలిఫోన్ వీడియో ద్వారా బట్టలిప్పి ప్రైవేటు పార్టు చూపించమని మరియు అసభ్యకరమైన సమాచారం పెట్టగా బాధితురాలు ఏడుస్తూ అట్టి విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి, గతంలో అనగా ఈ సంఘటనకి వారం క్రితం వాళ్ళింటికి చిన్నపిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఉమామహేశ్వరరావు తనని ఎత్తుకొని బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి బట్టలు విప్పమని కోరగా, బాధితురాలు అరిచి విడిపించుకుని వచ్చిందని, సెల్ ఫోన్ లో తీయనందున తప్పుడు మెసేజ్లు దురుద్దేశంతో వీడియోలు పెడుతున్నాడని చెప్పగా, బాదిత కుటుంబం ఫిర్యాదు మేరకు అప్పటి అశ్వాపురం పి. ఎస్.సబ్ ఇన్స్పెక్టర్ ఈ నాగుల్ మీ రఖాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో ఉమామహేశ్వరరావు పై ఛార్జిషీట్ దాఖలు చేశాడు.*
ప్రాసెక్యూషన్ తరఫున ఎనిమిది మంది సాక్షులను విచారించారు. సుగ్గల ఉమామహేశ్వరరావు @ నానీపై నేరం రుజువు కాగా, న్యాయమూర్తి ఐదు సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష మరియు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ప్రోస్క్యూషన్ తరఫున ఫోక్సో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి నిర్వహించారు.
కోర్టు లైజాన్ ఆఫీసర్ షేక్ అబ్దుల్ ఘని, మరియు, (కోర్టు డ్యూటీ ఆఫీసర్) పి సి.ఏం. ఈశ్వర్ లు సహకరించారు…*