తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏ.సి.బి. టోల్ ఫ్రీ నెంబర్ 1064 విస్తృత ప్రచార నిమిత్తం రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఆవిష్కరించారు.లంచం ఇవ్వవద్దని, లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. దేశ అభివృద్ధి కి అవినీతి ఆటంకమని, అవినీతి నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. సమాచారానికి రాష్ట్ర ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ 9154388989/040-23251555, వాట్సాప్ నెంబర్ 9440446106, ఇ-మెయిల్ dg_acb@telangana.gov.in, ఖమ్మం రేంజ్ 9154388981/ 0874-2228663, ఇ-మెయిల్ dsp_acb_kmm@telangana.gov.in ను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎసిబి డిఎస్పీ వై. రమేష్, ఇన్స్పెక్టర్ ఎన్. శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 62