వైకల్యం అనేది శరీరానికే గాని సంకల్పానికి కాదు
– పినపాక ఎంఈఓ నాగయ్య
పినపాక
వైకల్యం అనేది శరీరానికే గాని సంకల్పానికి కాదని పినపాక ఎంఈఓ నాగయ్య అన్నారు. మంగళవారం
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పినపాక మండలం ఈ బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలో గల పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో దివ్యాంగులతో ప్రదర్శన, క్రీడ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై దివ్యాంగులకు క్రీడా పోటీలు ప్రారంభించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఉన్న ప్రతిభ ను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు తోడ్పాటు అందించాలని అన్నారు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఉపాధ్యాయులు సదరం సర్టిఫికెట్ పొందే విధానం పై వారి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. దేనిలో తీసిపోకుండా విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలు దివ్యాంగులు కనబరుస్తున్నారని తెలియజేశారు.అనంతరం క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్, ఉపాధ్యాయులు శ్యాం నాయక్, అంబికా,దీవెన, దివ్యాంగులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు