పినపాక,
పినపాక మండలం బోటిగూడెం బీటు పరిధిలోని చింతలపాడు ఆదివాసి గ్రామమునందు మంగళవారం నాడు ఏడూళ్ళ బయ్యారం అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో అటవీక్షేత్రాధికారి ఉపేందర్ మాట్లాడుతూ…. అటవీభూములలో పోడు వ్యవసాయం ,వన్యప్రాణి సంరక్షణ మరియు అడవి నందు మంటల నియంత్రణ గురించి ఆదివాసీలకు అవగాహన కల్పించారు. అడవిని సంరక్షించాలని ఎవరైనా అక్రమంగా అడవిలో నరికి పోడు చేయడానికి ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూగజీవులైన అడవి జంతువులను వేటాడటం, వధించటం చట్టరీత్యా నేరమని తెలిపారు. అటవీ చట్టాలు అధిక్రమిస్తే జరిగే పర్యవసానాలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ వెంకటేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్స్ వెంకటమ్మ, సూరయ్య ,బీట్ ఆఫీసర్స్ శశిరేఖ ,సాంబశివరావు తులసీరామ్ ,ఆదిత్య, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.