రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) డిసెంబర్ 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాపనయ్య తాండ కు చెందిన మాలోతు దుర్గ్య తండ్రి పూల్య వయసు (39) సంవత్సరాలు కులం లంబాడ వృత్తి వ్యవసాయం తన భార్యతో కలిసి హైదరాబాదులో చదువుకుంటున్న తన కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసి అతని దగ్గరకు వెళ్లారు.తిరిగి మంగళవారం 03.12. 2024 ఉదయం 8 గంటలకు వారి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాలం పగలగొట్ట బడి ఉండి,తన ఇంట్లో బీరువాలోని రెండు తులాల కమ్మలు,మూడు మాసాల మాటీలు,అద్దతులం రింగు, కొంత నగదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకుపోయారని ఫిర్యాదు చేసినట్లుపోలీసులు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట ఎస్సై బాలరాజ్ తెలిపారు.
Post Views: 46