వైరా మండలం లో దొడ్డు రకాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచాకపోతే MLA కాంపు కార్యాలయం రైతులను కదిలించి ముట్టడి చేస్తాం.
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నేటి గదర్ న్యూస్ డిసెంబర్ 03:వైరా ప్రతినిధి.
వైరా:- వైరా మండలం లో ఇరవై వేల ఎకరాల్లో వరి పంట సాగు అయితే దాని లో తొమ్మిది వేల ఎకరాల్లో దొడ్డు రకాల అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. మంగళవారం బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్ లో మల్లెంపాటి రామారావు అధ్యక్షతన జరిగిన రైతు సంఘం సమావేశం లో రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైరా మండలం లో ఏర్పాటు చేసిన 21 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రెండు మాత్రమే దొడ్డు రకాల ధాన్యం కొనుగోలు కి అవకాశం ఉందని దీన్ని వల దొడ్డు రకాల ధాన్యం రైతులు అతి తక్కువ ధరకు అమ్ముకునే స్థితికి వచ్చింది అని దొడ్డు రకాల కొనుగోలు కేంద్రాలు పెంచాలని గత ఇరవై రోజుల క్రితం రైతులు వైరా ఎమ్మెల్యే రాందాసు నాయక్ దృష్టి కి తీసుకువచ్చిన వ్యవసాయ శాఖ స్పందించలేదు అని కొనుగోలు కేంద్రాలు పెంచాకపోతే వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రైతులను కదిలించి ముట్టడి చేస్తాం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు లోపు కూడా పూర్తిస్థాయిలో కాలేదు అన్నారు, రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో సర్వే నిర్వహించి రైతులు నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు రైతు భరోసా తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు, మండల అధ్యక్షులు మేడా శరబంధి, జిల్లా కమిటీ సభ్యులు వనమా చిన్న సత్యనారాయణ, బాణాల శ్రీనివాసరావు, ఎస్ కె జానిమీయా, సంక్రాంతి నర్సయ్య, కొంగర సుధాకర్, యనమద్ది రామకృష్ణ,వడ్లమూడి మధు, ఎస్ కె మజీద్, బి రెహెన తదితరులు పాల్గొన్నారు.