*తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో వెంకటెశ్వర చారి*
నేటి గదర్ కరకగూడెం: కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని కలిగ ఉన్న పాఠశాల భవనాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చెయ్యనున్న నవోదయ పాఠశాల ప్రాంతాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి,ఏఎమ్ఓ నాగరాజు, శేఖర్,ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.పినపాక మండలం గోపాలరావు పేట గ్రామంలో నూతనంగా నిర్మాణం చెపట్డాలనే ఉద్దేశంతో స్థలని ఉన్నత అధికారులు పరిశీలించారు. అనంతరం అక్కడి రైతులు స్థలం నిరాకరించడంతో తాత్కాలికంగా కరకగూడెంకి తరలించారు.అనంతరం ఇక్కడినుండి అశ్వపూరం తరలించనున్నట్లు డీఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంఈఓ గడ్డం మంజుల, అశ్వపూరం ఎంఈఓ వీరస్వామి నవోదయ సెంట్రల్ టీం అధికారులు, ఎస్ సీఅర్పిలు పాల్గొన్నారు.
Post Views: 203









