+91 95819 05907

ఇంకా ఎన్నాళ్లీ నిరీక్షణ?కలగానే “ఎన్.హెచ్.ఎం” కొలువుల క్రమబద్ధీకరణ

• *రెండు దశాబ్దాలుగా ఉద్యోగులు, సిబ్బంది ఎదురుచూపులు..*

• *జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా*

• *తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్*

*వరంగల్ జిల్లా*
*04 ఫిబ్రవరి 2025*

నేషనల్ హెల్త్ మిషన్ లో 2000లో నాటి కేంద్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది నియమించింది. నాటి నుంచి ఉద్యోగులు అరకొర వేతనాలతోనే కుటుంబాలను పోషిస్తున్నారు. పిల్లలను చదివించుకుంటున్నారు. రెండు దశబ్దాలుగా భారంగా బతుకుబండిని లాగుతున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కొలువులును క్రమబద్దీకరిస్తామని నేతలు వాగ్దానాలు చేస్తున్నారే తప్ప వాటిని ఆచరణలో చూపడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. కొలువుల క్రమబద్ధీకరణ కాకపోగా, జాతీయ ఆరోగ్య మిషన్ 7 నెలల పీ ఆర్ సి ఏరియర్స్ సంబంధించిన నిధులు నిలిచిపోయాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17,541 మంది ఉన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు అవుతుంది. ప్రభుత్వం తమ ఆవేదనను ఆలకించి కొలువులను క్రమబద్ధీకరించాలని, లేదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఉద్యోగులు కోరుతున్నారు.

*పల్లెల్లోనూ సేవలు…*

వైద్యారోగ్యశాఖ పరిధిలోని ఎన్హెచ్ఎం ఉద్యోగులు నగరా లు, పట్టణాలే కాదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. రేయింబవళ్లు వీరి సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వాలు వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు మాత్రం ముందుకురావడం లేదు.వీరు సమస్యలు పరిష్కరించాలి. జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలి. ఉద్యోగులకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 510 ద్వారా 8 క్యాడర్స్ ఉద్యోగులకే మేలు జరిగింది. మిగతా 70 క్యాడర్స్ వారంతా నష్టపోయారు.రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి 510 జీవోను అందరికీ వర్తింపజేయాలి, సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలి. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మాకూ జీతభత్యాలు (బేసిక్ పే) చెల్లించాలి, అందరికీ 30% వెయిటేజ్ ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా చేయాలి, మహిళా ఉద్యోగులకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఈ.ఎస్.ఐ సౌకర్యం ప్రతి ఒక్క ఉద్యోగికి కల్పించాలి. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా వేతనాలు మాత్రం పర్మినెంట్ ఉద్యోగుల వేతనాల్లో సగమం కూడా ఉండడం లేదు. తమ కొలువులను క్రమబద్దీకరించాలని రెండు దశా బ్దాలుగా ఉద్యమిస్తున్నామని, ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టామని, అయినా ఫలితం లేకపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు.

*వివిధ కేటగిరీల్లో*..

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు వీరికి 510 ప్రకారం జీతాలు పెంచని వారి లిస్ట్ కింద మెన్షన్ చేయడం జరిగింది. అర్బన్ హెల్త్ సెంటర్లలో (పీ.హెచ్.ఎం) పబ్లిక్ హెల్త్ మేనేజర్, అకౌంటెంట్లు కం డీఈవో, సపోర్టింగ్ స్టాఫ్ లో మెడికల్ ఆసిస్టెంట్లు (ఆర్) ఎం.ఎన్.ఓ, వాచ్ మెన్, స్వీపర్, డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లలో డెంటల్ టెక్నీషియన్, సోషల్ వర్కర్, ఆడియాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, సైకాలజిస్ట్, ఎన్.ఆర్ సి. కౌన్సిలర్స్, ఎన్ ఆర్ సి కుక్స్, ఆర్.కె.ఎస్.కె. కౌన్సిలర్స్, బ్లాక్ లెవెల్ అకౌంటెంట్స్, బ్లడ్ బ్యాంక్ లో డీ.ఈ.వో, ల్యాబ్ అటెండర్, డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్, డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కమ్యూనిటీ మొబిలైజర్, ఎస్.ఎన్.సి.యూ.లో డీ. ఈ.వో, సెక్యూరిటీ గార్డులు, సపోర్టింగ్ స్టాప్.. ఓ.టీ టెక్నీషియన్ అండ్ ఓ.టి అసిస్టెంట్స్, ఫిజియోథెరపిస్ట్, ఎన్.సి.డి కౌన్సిలర్, టీ-హబ్ లో మేనేజర్ , రేడియోగ్రఫీ, డీ.ఈ.వో, సపోర్టింగ్ స్టాప్, ఎం.సి. హెచ్. సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్స్, పీ.హెచ్.సి. (డీ.ఈ.వో) ఆరోగ్య మహిళ డీ.ఈ.వో , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాంటిజెంట్ వర్కర్లు, ఆయుష్ లో ఎస్.ఎన్.ఓ, ఎఫ్.ఎన్.ఓ.. ఎం.సీ. హెచ్.లో సపోర్టింగ్ స్టాఫ్.. సెక్యూరిటీ గార్డులు , వాచ్ మెన్ ..
యన్.టి.ఈ.పి లో ఎస్.టి.ఎల్. ఎస్, ఎల్.టీ. సూపర్వైజర్స్, ఎస్.టి.ఎస్., టి.బి.హెచ్.వి., డి.ఈ.ఓ, డి.పి.ఎస్., డి.పి.పీ.ఎం, డీ.పీ.సీ., సూపర్వైజర్ ,పల్లె దావఖన వైద్యాధికారులు (ఎం.ఎల్. హెచ్.పి) …పాటు పలు కేటగిరీలకు చెందిన వారు పనిచేస్తున్నారు. వీరికి 510 జీవోలో 8 క్యాడర్లకు ఏలా వేతనాలు పెంచారో ఆలాగే మిగతా 70 క్యాడర్లకు కూడా అలాగే వేతనాలు పెంచి న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !