రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 4:- మెదక్ జిల్లా రామాయంపేటలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుష్కర బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొని మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా దేవలయ అర్చకులు,ఆలయ నిర్వాహకులు తిరుపతి రెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిలో తాను ఎల్లప్పుడూ తన వంతుగా మీకు అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 139