రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 4:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మంగళవారం చివరి రోజు కావడంతో ఘటాభిషేకం కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి హాజరై పాల్గొన్నారు.ఈ సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు బాగా పండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 27