నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
క్రికెట్ అండర్ -19 వరల్డ్ కప్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన భద్రాచలం కి చెందిన గొంగడి త్రిషను బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. త్రిష భవిష్యత్తులో సీనియర్ జట్టు లో చోటు సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రికెటర్ త్రిషకి తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి పొంగులేటి అన్నారు.అలాగే యువ మహిళా క్రికెటర్ త్రిష ను అభినందించిన వారిలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ , భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , భద్రాచలం నియోజకవర్గ నాయకులు తదితరులు ఉన్నారు.
Post Views: 186