-స్టడీ మెటీరియల్ అందజేసిన మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ
★ ఏజెన్సీకి తోలం శ్రీనివాసరావు చేస్తున్న సేవలు అభినందనీయం
★పినపాక మండల విద్యా శాఖ అధికారి నాగయ్య దొర
పినపాక
ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ నవోదయ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. బుధవారం విప్పలగుంపు గ్రామంలో ఎంఈఓ కొమరం నాగయ్య చేతుల మీదుగా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు తోలెం శ్రీనివాసరావు అందజేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నవోదయ స్టడీ మెటీరియల్ అందజేస్తున్న మహర్షి స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉద్దేశంతో స్టడీ మెటీరియల్ అందజేయడం గొప్ప విషయం అన్నారు. స్టడీ మెటీరియల్ ను విప్పల గుంపుతో పాటు కిష్టాపురం, కొత్తూరు, అమరవరం ప్రాథమిక పాఠశాలల్లో సైతం అందజేశారు. అనంతరం మహర్షి స్వచ్చంద సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావును ఎంఈఓ, ఇతర ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రాంగోపాల్, డిఆర్పీలు శ్రీకాంత్, రాజేష్, ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, లచ్చు, జమ మూర్తి, ప్రశాంత్, ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాపారావు, సాంబ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.