నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి:
చిన్న వయసులోనే లక్ష్యాలను సాధించే దిశగా ప్రయాణాన్ని ప్రారంభించి, లక్ష్యాలను చేరుకోవడానికి తమను తాము సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థులను ఉద్బోధించారు.
బుధవారం ఖమ్మం గ్రామీణ మండలం జలగం నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు నేలపై కూర్చొని ఉపాధ్యాయులు బోధించే పాటలు విన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు పాటలు సైతం బోధించారు.పాఠశాలలో బోధనా పద్ధతులు, ఏవైనా సమస్యలు ఉన్నాయా, పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా, వారు పెద్దయ్యాక ఏమి కావాలనుకుంటున్నారు మరియు వారి జీవిత ఆశయాల గురించి ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఉదయం నిద్ర లేవగానే డైరీలో తమ లక్ష్యాలను రాసుకోవాలని ఖాన్ విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువులు, ఆటల్లో ముందుండాలి.
ప్రతిరోజూ ఇంట్లో చదువు, ఆటలు ఆడటానికి కొంత నిర్దిష్ట సమయాన్ని కేటాయించి, దానికి అనుగుణంగా నడుచుకోవాలని, విద్యార్థులు తమ ఆరోగ్యం, పెరుగుదలను జాగ్రత్తగా చూసుకోవాలని, పోషకాహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్ తినే అలవాట్లను తగ్గించుకోవాలని ఆయన సూచించారు.