*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని ప్రకటన చేయడం ఎంతవరకు సరైంది కాదని దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం నేత ముక్తి సత్యం అన్నారు. నాడు దేశంలో బ్రిటిష్ కాలం నుండి ఆదివాసులు చేసిన పోరాట ఫలితమే భారత రాజ్యాంగంలో ఆదివాసి హక్కులను గుర్తిస్తూ 5,6 షెడ్యూలను పొందుపరిచారని అన్నారు. తర్వాత సాగిన అనేక పోరాటాల ఫలితమే 1/70 చట్టం ల్యాండ్ రెగ్యులేటరీ చట్టం, పేసా చట్టం, చేపట్టాయని అన్నారు. ఆదివాసి హక్కులను హరించేందుకే చట్టాలను సవరించాలని ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 12వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏజెన్సీ ప్రాంత బందును జయప్రదం చేయాలని అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివాసీలకు అన్యాయం చేసే వారిపై ఆదివాసి సమాజం తరఫున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ ఫోరం నాయకులు ఈసం కృష్ణ, మంగయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు
