అడ్వకేట్ ఊకే రవి పై దాడికి ప్రయత్నించిన గిరిజనేతరులపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలి -ఆదివాసి సేన అశ్వారావుపేట మండల కమిటీ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి, 06: ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియు న్యాయవాది ఊకె రవి పై దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ దాడికి ప్రయత్నించడంతో పాటు, ఆయన వాదిస్తున్న కేసులనూ, తన క్లైంట్స్ ద్వారా కేసు వెనక్కి తీసుకోక పోతే ఆత్మ హత్య చేసుకుంటామని డ్రామాలాడుతూ, అశాంతియుత, ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న గిరిజనేతరుల పై వెంటనే ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆదివాసి సేన అశ్వారావుపేట మండల కమిటీ కుర్సం బాబురావు, సొందే సుమన్ బాబు, తాటి లక్ష్మణ్, కనితి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జరిగిన సంఘటనపై సంబంధిత పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినందున పోలీసు వారు జాప్యం చేయకుండా వెంటనే స్పందించి, ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి ఒత్తిడులకు గురికాకుండా, కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. కొంత మంది గిరిజనేతరులు ఏజన్సీ ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడి ఆదివాసుల భూములను అన్యాయంగా లాక్కొడమే కాకుండా, తిరిగి ఆదివాసుల పైనే తిరగబడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆదివాసులపై జరుగుతున్న అన్యాయాలు అక్రమాలకు అడ్డుకట్ట వేయటానికి న్యాయ బద్దంగా చట్టబద్ధంగా పోరాడుతున్న న్యాయవాది రవి పై అక్కసుతో, కొందరు గిరిజనేతరులు.. “ మీ వల్లనే మా భూములు పోతున్నాయి, మా ఇల్లు కూడా ఖాళీ చేయాలని చెబుతున్నారు అంటూ”.. గిరిజనేతరులు న్యాయవాది రవి – ఇంటి దగ్గరకు వెళ్లి, పురుగుల మందు తాగి చస్తాం అని బెదిరించారని, ఈ విషయంలో ఎందుకమ్మా మీరు వస్తున్నారు, నేను న్యాయం చేయాలి కదా, మీరు వెళ్ళండి అని రవి చెప్పగా వినకపోవడమే కాకుండా, వినిపించకపోయేసరికి స్థానిక ఎస్సై, పాల్వంచ కి ఫోన్ చేసి మాట్లాడిపించడం జరిగినప్పటికీ వారు ఎవరు కుడా చెప్పిన వినలేదని మరియు వాగ్వాదానికి దిగుతూ, వితండవాదంతో, దుర్భాషలాడుతూ తదుపరిగా గ్రామంలో ఉన్నటువంటి నీళ్ల ట్యాంకు ఎక్కి ఊకే రవి లాయర్ వలన మేము చనిపోతున్నాము, మా చావుకు కారణం లాయర్ ఊకే రవి మాత్రమే అని ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ సైతం చేయడం జరిగిందని, గతంలో పాల్వంచ మండలంకు సంబంధించిన ఒక కేసు విషయంలో కూడా గిరిజనులకు గిరిజనేతరుల దగ్గర ఉన్నటువంటి భూమిని పంచనామ చేసి స్వాధీనం చేయాలని సంబంధిత అధికారులకు కలవగా, అట్టి విషయం మీద కూడా అడ్వకేట్ల పేర్లు రాసి మేము చనిపోతాం మీ వల్లనే మా భూములు పోతున్నాయి అని గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, అప్పుడు స్థానిక పోలీసులకు పాల్వంచ ఎంఆర్ఓ గారికి ఈ విషయం తెలియజేయడంతో, వారికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రోజు నేరుగా ఇంటికి వచ్చి మీ వలన మేము చచ్చిపోతున్నాం పురుగుల మందు తాగి చస్తాం అని బెదిరిస్తూ ఉండే సరికి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వటం జరిగిందని, ఈలోపులో ట్యాంకర్ ఎక్కి దూకి చస్తాము అనే లోపు స్థానిక ములకలపల్లి పోలీసులు వచ్చే నచ్చజెప్పి క్రిందకు దింపి పోలీస్ స్టేషన్కు గిరిజనేతలను తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గిరిజనేతరుల నుండి ప్రాణ హాని ఉన్నందున ప్రభుత్వం వెంటనే తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్రంలోని ఏజన్సీ ప్రాంతాల్లో అక్రమంగా చొరబడి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న గిరిజనేతరులను వెంటనే మైదాన ప్రాంతాలకు పంపించే ప్రక్రియను ప్రారంభించాలని వాళ్ళు డిమాండ్ చేశారు.