+91 95819 05907

నేడు మాతా రమాబాయి అంబేడ్కర్ 127 వ జయంతి

మా కోసం,మా భవిష్యత్ కోసం తన కన్న పిల్లల్ని పోగొట్టుకొన్న మాతృమూర్తి రమాబాయి.

“మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం మాతా రమాబాయి.

“బాబాసాహెబ్ చదువుకు వెన్నుముక మాతా రమాబాయి.

ఇప్పటి తల్లుల్లా స్వార్థం ఉండి ఉంటే భవంతుల్లో రాజ భోగాలు అనుభవిస్తూ ఉండేది మాతా రమాబాయి…కానీ ఈ దేశ అణగారిన వర్గాల కొరకు తను తన జీవితాన్నే కాక తన పిల్లల జీవితాల్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది.

*త్యాగం అంటే మగ్జిమ్ గోర్కి వ్రాసిన “అమ్మ” నవలలోని ” అమ్మ” పాత్ర కాదు మిత్రమా..!*

తన కళ్ళ ముందరే కన్న బిడ్డలు చనిపోతున్న ఆకాశమంత దుక్ఖాన్ని భూమాత లాగ దిగమింగిన రమాబాయి అంబేడ్కర్ ది.కోట్లాది మంది బిడ్డల భవిత కోసం వెలివాడల నుండి ఈ దేశ తలరాతలను వ్రాసిన అంబేడ్కర్ కి జీవిత భాగస్వామిగా, త్యాగశీలిగా నిలిచింది. మాతా రమాబాయి త్యాగాన్ని విస్మరించి జర్మనీ లో జన్మించిన జెన్నీ మార్క్స్ గురించి, అమ్మ నవలలోని అమ్మ పాత్ర ను గురించి ఆవేదనతో ఉపన్యాసాలు, క్లాసులు చెప్పి చైతన్యం తీసుకుని వస్తారు.వాళ్ళ జీవితాలు ఆదర్శంగా తీసుకోవాలని చెబుతారు. అదేంటో మన దేశంలో పుట్టిన మాతా సావిత్రి బాయి ఫూలే , రమాబాయి అంబేడ్కర్ ల గురించి మాత్రం చెప్పరు.ఓహో వీళ్ళిద్దరూ బిసీ, ఎస్టీలనే గా చెప్పడానికి మనసు ఒప్పదే..ఎంతైనా ఎర్రమనువాదులు కదా! అమ్మానాన్నలు జన్మనిచ్చారు.బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ హక్కులనిచ్చారు.అంబేడ్కరిజం బ్రతికిస్తుంది.

మహారాష్ట్రలోని సెంట్రల్ ఇండియాలోని కొంకణ్ ప్రాంతంలో “ధాబోల్” సమీపంలోని “వణంది” గ్రామంలో 1898 సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీన జన్మించారు.చిన్నప్పుడు రమాబాయి ను రామీబాయి అని పిలిచేవారు. రమాబాయి తల్లి మరణించడంతో తండ్రి భికూధూత్రే అతికష్టం మీద తన నలుగురు బిడ్డలను పెంచేవారు.సముద్రం చేపలను బుట్టలతో మోసేపని చేయడం వలన ఆరోగ్యం దెబ్బతిని గుండెల్లో నొప్పితో కాలం చేసారు. నలుగురు బిడ్డలు అనాథలు అవడంతో రమాబాయి చిన్నాన్న శంకర్ ధూత్రే ఆ బిడ్డల బాధ్యతలు తీసుకున్నారు.ఈయన ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసేవారు.రమాబాయి అక్క గౌరీబాయి ,చెల్లెలు మీరాబాయి,తమ్ముడు శంకర్ లు.గౌరీబాయికు చిన్నప్పుడే పరిణయం జరిగింది. రమాబాయి కు కూడా పరిణయం చేయాలని శంకర్ ధూత్రే చూస్తున్న సమయంలో అంబేడ్కర్ తండ్రి రామ్ జీ సక్పాల్ మాలోజీ కూడా తన తనయుడు అంబేడ్కర్ కు పరిణయం చేయాలని చూస్తున్నారు.అంబేడ్కర్ ను మొదటి సారిగా పాఠశాలలో చేర్చిన ఊరి “ధాబోల్”.అంబేడ్కర్ తండ్రి ధాబోల్ పరిసర ప్రాంతాల్లో సంబంధాలు చూస్తుండగా రమాబాయి కనబడుతుంది.రమాబాయి గుణగణాలు గమనించిన రామ్ జీ సక్పాల్ మాలోజీ అంబేడ్కర్ కు ఇచ్చి పెళ్ళి చేయాలని రమాబాయి చిన్నాన్న శంకర్ ధూత్రే ను కలిసి సంబంధం ఖాయం చేసుకున్నారు.

రమాబాయి పరిణయం :

డా.అంబేడ్కర్ కు రమాబాయి కు 1908 సంవత్సరం మంబాయి నగర సబ్ స్టేషన్ పరిధిలోని భాయ్ జిల్లాలోని చేపల మార్కెట్ లో రాత్రి పరిణయం జరిగింది.చేపల కంపు కొడుతున్న ఆ మార్కెట్ లో మరొక పక్కన మురికి నీటిలో పరిణయం జరిగింది.రమాబాయికు పరిణయం సమయానికి ఆమె వయస్సు 9 సంవత్సరాలు.అంబేడ్కర్ వయస్సు 16 సంవత్సరాలు.హిందూ సమాజంలో సవర్ణులు అయిన బ్రాహ్మణ ధర్మం ప్రకారం బాల్య వివాహాలు జరగేవి.సవర్ణులు పాటిస్తున్న బాల్య వివాహాలను అసవర్ణులు కూడా పాటించారు.పై వర్ణాలు యొక్క ప్రభావం కింది వర్ణాలు మీద కూడా ఉంది. మురికి పై నుండి కదా కిందకు వచ్చేది.

1924 సంవత్సరం నాటికి బాబాసాహెబ్ డా.బి.ఆర్ అంబేడ్కర్-రమాబాయి దంపతులకు ఐదుగురు గురు పిల్లలు..

1.యశ్వంత్ రావు
2.గంగాధర్
3.రమేశ్
4.ఇందు
5.రాజారత్న

యశ్వంత్ రావు తప్ప మిగిలిన నలుగురు పిల్లలు రెండు, రెండున్నర సంవత్సరాల వయస్సులో రక్త హీనత, పోషకాహార లోపంతో చనిపోయారు.రమాబాయి అంబేడ్కర్ లకు తీరని వేదనను మిగిల్చింది.చిన్న వయసులోనే యశ్వంత్ రావు పోలియో వ్యాధిగ్రస్థుడు.చిన్నవాడైన రాజారత్న అంటే రమాబాయికు ఎంతో ఇష్టం. ఎంతో గారాబంగా రాజారత్నను పెంచారు. రాజారత్నకు 9 నెలలు నిండే వరకూ రమాబాయి సపర్యలు చేసింది.1926 జూలై 19 వ తేదీన రాజారత్న నిమోనియాతో కాలం చేశాడు.బాధాకరం ఏమిటంటే రమాబాయి కూడా రక్త హీనతతోనే మరణించింది. మిషన్ కుట్టి, పేడ ఏరి పిడకలు అమ్మి కుటుంబాన్ని పోషించేది. ఈ విషయం డా.అంబేడ్కర్ తన రచన “థాట్స్ ఆప్ పాకిస్తాన్ ” అనే గ్రంథంలో నుదహరించారు.అందరిలోకి చిన్న వాడు రాజారత్న చాలా అందమైనవాడు.
చిన్నతనంలోనే వైద్యానికి డబ్బులేక మరణించాడు.
ఇతని మరణం అంబేడ్కర్ ని కుంగతీసింది.తను, తన బిడ్డలు ఎన్ని పాట్లు పడ్డా, ఏనాడు అంబేడ్కర్ చదువులకు గానీ, పోరాటాలకు గానీ అవరోధం కలిగించని మహాసాధ్వి మాతా రమాబాయి.

“నాకు రెండవ కొడుకు గంగాధర్ పుట్టాడు. చూడటానికి చాలా అందమైనవాడు. అతను అకస్మాత్తుగా జబ్బు పడ్డాడు. వైద్యం కోసం అవసరమైన డబ్బులు లేవు. అతని అనారోగ్యంతో ఒక్కసారి నా మనస్సు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఊగిసలాటలో పడింది.తిరిగి నాకు ఇలా ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను ఉద్యోగం చేసేటట్లయితే 7 కోట్ల ఆ అంటరాని వాళ్ళ గతి ఏమవుతుంది. వాళ్ళు గంగాధర్ కంటే తీవ్రమైన అనారోగ్యం పాలయివున్నారు. సరైన వైద్యం చేయించని కారణంగా ఆ పసిపిల్లవాడు రెండున్నర సంవత్సరాల అల్ప వయస్సులోనే చనిపోయాడు. వీధిలోని జనం వచ్చారు. అందరూ పిల్లవాడి మృతదేహాన్ని కప్పేందుకు కొత్తగుడ్డ తీసుకు రమ్మన్నారు. గుడ్డ తేవడానికి నా దగ్గర డబ్బులు లేవు. చివరకి నా ప్రియమైన భార్య తన చీర నుంచి ఒక ముక్క చించింది. ఆ చీరముక్క ఆ పిల్లవాడి మృతదేహంపై కప్పి జనం శ్మశానానికి తీసుకువెళ్ళారు. తర్వాత భూమిలో మృతదేహాన్ని పాతి పెట్టారు. అలాంటిది నా ఆర్థిక పరిస్థితి. అలాంటి కఠినమైన కడు పేదరికపు రోజుల్ని నేను చూశాను. అలాంటి కఠినమైన అనుభవాలు ఏ నాయకుడికీ ఎదురు కాకూడదు. కనుక సహజంగానే రమాబాయి మనసులో బాధపడుతూ ఉండేది. ” అని డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ వాపోయారు.

డాక్టర్ అంబేడ్కర్ 3-2-1928న రమాబాయి త్యాగాన్ని ఉద్ధేశించి “బహిష్కృత్ భారత్” పక్ష పత్రికలో వ్రాసిన సంపాదకీయంలో ఈ విధంగా వ్రాశారు : “నేను విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్లిన సమయంలో రేయింబవళ్ళు ఇంటి కోసం ఒంటరిగా అన్ని బాధలు సహించిన రమాబాయి నేటికి కూడా వాటన్నింటిని సహిస్తూనే ఉంది.నేను స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆపత్కాలంలో తలపై పెట్టుకున్న ఆ పేడ తట్టను ఆమె వదలాలని కానీ,వెనక్కు ముందుకు చూడాలని కానీ తలవంచలేదు.అట్టి మమతా మూర్తి, సుశీలమతి అయిన రమాబాయితో రోజులోని 24 గంటలలో అర్థగంట కూడా గడపలేక పోయేవాడను.”

చాలా మంది డా.అంబేడ్కర్ మిత్రులు సహాయ పడటానికి ముందుకొచ్చినా వారి సాయాన్ని రమాబాయి సున్నితంగా తిరస్కరించారు. ఇంకో విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అంబేడ్కర్ సోదరుడు బలరాం ఒక చిన్న సంస్థలో ఉద్యోగం చేస్తూ ఈ పరిస్థితులను గమనించి ఇంట్లో వాళ్లందరికీ కొత్త బట్టలు కొనడానికి డబ్బులు ఇచ్చారు. రమాబాయి కోసం కూడా కొత్త చీర తెచ్చుకొమ్మని డబ్బులిచ్చారు కానీ ఆ డబ్బుతో రమాబాయి అంబేడ్కర్‌కు ధోవతుల జత, ఒక పరుపు, దిండు, అన్నం తినేందుకు కూర్చునే పీట కొని తెచ్చారు. రమాబాయి కుమారులలో ఒకరైన యశ్వంత్‌రావుకి పోలియో రావడంతో వైద్య ఖర్చులు కూడా లేని స్థితిలో సంసారాన్ని ఈదడమే కష్టంగా మారింది. ఆమె పిల్లల్లో తొలి సంతానం రమేష్‌తో సహా గంగాధర్, ఇందు, రాజరత్న అనారోగ్యంతో మరణించడం ఆమెను మానసికంగానూ, శారీరకంగానూ కుంగదీసింది. ముఖ్యంగా రాజరత్న మరణం ఆమెను తీవ్ర అనారోగ్యానికి గురిచేసింది. 1935 మే 27న వారి దాదర్ రాజగృహలో అంబేడ్కర్ ప్రేమతో ‘రామూ’గా పిలుచుకునే రమాబాయి 38 సంవత్సరాల వయసులోనే అంబేడ్కర్‌కి శాశ్వతంగా దూరమయ్యారు.

మాతా రమాబాయి సుగుణశీలి,మహాసాధ్వి :

మాతా రమాబాయి చదువుకోలేదు, తెలివైన రమాబాయి గురించి ముందుగానే అంబేడ్కర్ కు తెలుసు.ఇద్దరూ ఎంతో గౌరవంతో జీవించారు.అంబేడ్కర్ – రమాబాయి లు త్యాగం, గౌరవం, నమ్మకం కలిగి ఉండేవారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల చక్కని బంధం ఏర్పడింది. డా.అంబేడ్కర్ తన భార్య రమాబాయి ను ప్రేమగా “రామూ” అని పిలుచుకునేవారు.రమాబాయి తన భర్తను ఎంతో ప్రేమతో “సాహెబ్” అని పిలిచేవారు. అంబేడ్కర్ తన జాతి ప్రజలు అనుభవిస్తున్న అంటరానితనం, వివక్ష, కష్టాలు గురించి పోరాటం చేయడాన్ని చూసి,ఈ దేశం కోసం తన భర్త చేస్తున్న త్యాగం గురించి ఎంతగానో గర్వించేది.ఏనాడూ రమాబాయి అంబేడ్కర్ ను వెనక్కి లాగే ప్రయత్నం చేయలేదు.తన భార్యకు అంబేడ్కర్ చదువునేర్పే ప్రయత్నాలు చేశారు. ఆమె పెద్దగా చదువుపట్ల ఆసక్తి చూపలేదు. ఇంట్లో పనులు అన్నీ తానే చూసుకునేది.సంతకం పెట్టడం నేర్చుకున్న రమాబాయి తన భర్త చేస్తున్న సమాజ సేవకు తను పూర్తి తోడ్పాటును అందించడంలోనే ఉండిపోయింది. మానసికంగా చాలా తెలివైన రమాబాయి చదువుకన్నా తన భర్త విద్యావేత్తగా ఎదుగుతుండటం చూసి ఎంతగానో ఆనందించేవారు.

మహాసాధ్వి రమాబాయి :

మాతా రమాబాయి తన భర్త చదువుకోవడం కోసం డబ్బులు దాచేవారు.తన భర్త ఇచ్చిన 50/- రూపాయలను కూడా ఆమె రూ 1.50/- చొప్పున 30 పొట్లాలు కట్టేవారు.మిగతా 5/- రూపాయలు ముఖ్యమైన ఖర్చులు కోసం దాచేవారు. రోజుకు ఒక పొట్లం చొప్పున ఖర్చు చేసేవారు.

రమాబాయి దయనీయ జీవితం :

తన కుటుంబం కోసం రమాబాయి పేడ ఎత్తి పిడకలు తయారు చేసి ఇంటింటికి తిరిగి అమ్మేవారు.పేడ కోసం పక్క గ్రామాలకు వెళ్ళేవారు. రమాబాయి పిడకలు అమ్ముతుంటే ఇరుగుపొరుగు మహిళలు వెటకారంగా మాట్లాడేవారు.రమాబాయి సున్నితంగా కుటుంబం కోసం పిడకలు అమ్మి కష్టపడుతుంటే ఎందుకు సిగ్గు పడాలి? అని రమాబాయి ఎదురు సమాధానం చెప్పేవారు.

కరుణగల రమాబాయి :

నిమ్నజాతుల వారికి కమ్యూనల్ అవార్డు మేలు చేసేది. దానికి వ్యతిరేకంగా గాంధీ పూనాలోని ఎరవాడ జైలులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. గాంధీ ఆరోగ్యం క్షీణించడంతో గాంధీకి ప్రాణభిక్ష పెట్టమని గాంధీ భార్య కస్తూరిబా ,సరోజిని నాయుడు మరికొందరు మహిళలు అంబేడ్కర్ ఇంటికి వెళ్ళి అర్థించారు.ఈ విషయం తెలుసుకున్న రమాబాయి బాబాసాహెబ్ దగ్గరకు వెళ్ళి గాంధీ ప్రాణాలు ఎలాగైనా కాపాడండి లేదంటే ఆ పాపం మీకు చుట్టుకుంటుంది అంటూ ప్రాధేయపడ్డారు.వేల సంవత్సరాల మన బతుకులను బాగుచేసుకునే అవకాశాన్ని గాంధీ కాజేయాలని చూస్తున్నాడు అని అంబేడ్కర్ అంటారు. రమాబాయి అమాయకంగా ఎలాగైనా గాంధీ ప్రాణాలు కాపాడి కస్తూరి బా కు పతిభిక్ష పెట్టమంటుంది.రమాబాయి ఎంతటి కరుణ గల మనసున్న మాత అనేది మనం అర్థం చేసుకోవచ్చు.

రమాబాయికు అనారోగ్యం వచ్చి మంచానపడినప్పుడు అంబేడ్కర్ తలుపు దగ్గర నుంచే చూసి వాకబు చేసి వెళ్ళేవారు. ఆమెతో గడిపే సమయం ఆయనకు ఉండేది కాదు.దీంతో రమాబాయి ఎంతో బాధపడేవారు.ఉపశామ్ గురూజీ రమాబాయి ను చూడటానికి వచ్చినప్పుడు రమాబాయి తన బాధను ఆయనతో చెబుతోంది.ఉపశామ్ గురూజీ అంబేడ్కర్ దగ్గరకు వెళ్ళి రమాబాయి మనోవేదనను ,అనారోగ్య పరిస్థితిని వివరించగా ఏడు కోట్ల అంటరాని వాళ్ళ జబ్బును తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను.దీనికి నా భార్య కూడా సహకరించాలని ,ఆమె ఆరోగ్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశానని, తనతో గడిపేందుకు సమయం ఇవ్వలేక పోవడం నా తప్పేనని అంబేడ్కర్ వాపోతారు.

రమాబాయికు ఎప్పటినుండో పండరీ పురం వెళ్ళి విఠోభాను చూడాలని ఉండేది. తన చివరి కోరిక తీర్చమని అంబేడ్కర్ ను కోరగా ఒకరోజు పండరీ పురం తీసుకుని వెళ్ళారు.అంటరాని వాళ్ళు కారణంగా 100 గజాల దూరం నుండే దర్శనం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రమాబాయి ఎంతో ఆవేదన తో ఏడ్చింది.ఆ సమయంలో అంబేడ్కర్ భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వని విఠోభా దేవుడు ఎట్లా అవుతాడని ప్రశ్నించారు.

1935 మే నెల 26 న రమాబాయి ఆరోగ్యం మరింత క్షీణించి బొంబాయిలోని దాదర్ లో నిర్యాణం చెందారు.చివరి సారిగా రమాబాయి భర్త తో ” సాహెబ్ మీరు నా ఏడు కోట్ల పిల్లలు గురించి శ్రద్ధ వహించండి. వాళ్ళకి సేవ చేయడమే మీ లక్ష్యం. మహోన్నతమైన ఆ దారి నుండి మీరు ఎన్నడూ తొలగవద్దు.వారికి గౌరవమర్యాదలు కల్పించవలసిన బాధ్యత మీదే.” అని చిన్న స్వరంతో పలికారు.బాబాసాహెబ్ ఎంతో దుక్ఖించారు.భార్య మరణంతో చిన్న పిల్లవాడు వలె బాబాసాహెబ్ ఏడ్చారు.వారం రోజుల పాటు గది నుండి బయటకు రాలేకపోయారు.ఆ సమయంలో బౌద్ధ భిక్షువుగా మారాలని చీవరాలు కూడా ధరించారు.మిత్రులు సలహాతో తన అభిప్రాయం మార్చుకున్నారు.ఎందుకంటే కోట్లాదిమంది ప్రజలకు సేవ చేయాలంటే పోరాటం తప్పనిసరి కాబట్టి. 1945 లో అంబేడ్కర్ తన గ్రంథం “పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన” గ్రంథాన్ని రమాబాయికు అంకితం ఇస్తూ రమాబాయి గురించి ఇలా వ్రాసారు ” ప్రియమైన రామూకి! సాత్వికమైన ఆమె మనస్సు ఆమెలోని మానసిక సద్భావనలతో పవిత్రమైన సదాచారాలతో దుక్ఖ భరితమైన దినాల్లో నాకు అండగా నిలబడింది. అప్పుడు మాకు ఎవరూ సహకరించలేదు. పేదరికం, బాధలు నిలువునా మండిస్తున్నా అత్యంత సహనశీలతతో ,బలిదానంతో త్యాగం కర్తవ్య పరాయణాలతో నన్ను నడిపించిన ఆమె స్మృతిలో నివాళి…..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అల్లు సతీష్‌ రెడ్డికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

నేటి గదర్ న్యూస్, పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్యకర్త అల్లు సతీష్‌ రెడ్డి ఇటీవల మరణించగా అతని దశదిన కార్యక్రమం గురువారం జరగింది. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ

Read More »

మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, యం ఎల్ సి, జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్

Read More »

మానవత్వాన్ని చాటుకున్న బీటీపీఎస్ సీ ఈ బిచ్చన్న, ఉద్యోగులు

– చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్. – సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం. – లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే

Read More »

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరువుకోవాలి: ఎస్సై

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో , సంప్రదాయ రంగులను ఉపయోగించి సురక్షితంగా జరుపుకోవాలి -శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయారాదు -ఎదుటివారికి ఇబ్బంది కల్గించవద్దు

Read More »

ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : బీ ఆర్ ఎస్

-. -భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని

Read More »

DSFI (డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ సభ ను జయప్రదం చేయండి

◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని *ప్రకాశం జిల్లా 13/03/2025 గురువారం…!* *తెలంగాణలో* జరుగుతున్న భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య *(DSFI)* ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ రాష్ట్ర నాయకుడు

Read More »

 Don't Miss this News !