నేటి గద్దర్ న్యూస్ చింతకాని ప్రతినిధి. పిచ్చయ్య
జాతీయ రహదారి పై అండర్ పాస్ ఇవ్వాలనే డిమాండ్ తో శుక్రవారం రైతులు ఆందోళన నిర్వహించారు.బాధిత రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చింతకానిమండలబస్వాపురం వద్ద కొత్తగా నిర్మిస్తున్న సూర్యాపేట దేవరపల్లి జాతీయ రహదారి బస్వాపురం నుండి అల్లిపురం వరకు ప్రభుత్వ నక్షలో ఉన్న 53 అడుగుల డొంక దారి వద్ద అండర్ పాస్ ఇవ్వాలనిఅలా ఇవ్వని పక్షంలో వంద ఎకరాలకు దారి ని కోల్పోయి రైతు లు ఇబ్బంది అవుతుందని బస్వాపురం అల్లీ పురం రైతు లు ఈ రొజు అనేక మంది స్థానిక రైతులు చంద్రకని నరసింహా రావు కోటేశ్వరరావు పేరబోయన రవి ల అధర్యం లో జాతీయ రహదారి వద్ద అందోళ్ళన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని బాధిత రైతులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బాధిత రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.