*సంకెళ్లు వేసి పంపిన మౌనమే నా మోడీజీ?*
*ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని,భారతీయులకు రక్షణ కల్పించాలి..*
*వెంకటేష్ పి. డి. ఎస్. యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి*
*ఇండియన్స్ పట్ల అమెరికా అధ్యక్షులు ట్రాంప్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పి డి ఎస్ యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ నందు వినుత్నంగా ట్రాంప్ పేస్ మాస్క్ తో గాల చేతికి సంకెళ్ళతో వేసిన్నట్టు కార్యక్రమం తో పాటు అమెరికా ట్రాంప్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది.*
ఈ సందర్బంగా పి. డి. ఎస్. యూ తెలంగాణా రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్,జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ దేశ పౌరుల చేతికి సంకెళ్లు వేసి పంపినా ప్రధాని మోడీ మౌనంగానే ఉంటారా? అని కేంద్రంపై, ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు.
భారత్ కు అమెరికా మిత్ర దేశమని గొప్పగా చెప్పుకొంటున్న కేంద్రం ప్రభుత్వం? ట్రంప్ ప్రభుత్వం భారతీయుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంత ఇంత క్రూరత్వంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు.అక్రమ వలసదారులంటూ 104 మందిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ భారత్ కు తిప్పిపంపనున్న విషయం కేంద్రానికి ముందే తెలిసి కూడా విశ్వగురు ఎందుకు మాట్లాడలేదు అన్నారు. ఆమెరికా మాదిరిగానే అక్రమ వలసదారులను భారత మోడీ ప్రభుత్వం కూడా వారిని నేరస్థులుగానే పరిగణిస్తోందా? అని వారిని ప్రశ్నించారు.
వారి లో ఖమ్మం జిల్లాకు చెందిన 14 మంది ఉండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్టైం ఉద్యోగాలు చేస్తే తప్ప అక్కడ జీవించే పరిస్థితి లేదు. అమెరికా పంపేందుకు ఇక్కడ బ్యాంకుల ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పు చేసి ఇంకా కొంత మంది ఆస్తులు తాకట్టు పెట్టి విదేశాలకు పంపించారు అటువంటి వారి ఇప్పుడు పార్ట్ టైం జాబ్ లేకుంటే జీవితలు ప్రశ్నార్థకంగా మారిన కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
విశ్వ గురువుగా చెప్పుకునే (ప్రధాని మోదీ) ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, భారత ప్రధాని మోదీ చాలా మంచి స్నేహితు లని అంటారు. మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు ట్రంప్ తో మాట్లాడలేదు. మన వాళ్లను తీసుకురావడానికి ఒక విమానం పంపలేమా? మనుషులతో ఇలాగే ప్రవర్తిస్తా రా? ” అని నిలదీశారు. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి, ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని భారతీయులకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు సాదిక్, నసీర్,నిగ్నేష్, రఫీ, అనూష, అఖిల, సంధ్య, స్పందన, సింధు తదితరులు పాల్గొన్నారు.