★న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరు మధు
నేటి గదర్ న్యూస్, చర్ల ప్రతినిధి:
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకొచ్చే ముందు ఆరు గ్యారంటీలను ప్రజలకు ఇచ్చింది అధికారంలోకి వచ్చిన 100 రోజులల్లో ప్రకటించింది ఈ ఆరు గారంటీని అమలు చేస్తానని చెప్పి ప్రకటించింది ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అంటూ తెలంగాణ ప్రజానీకానికి పాటించిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలు సంవత్సరంకు పైగా అవుతున్న ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు తయారైంది తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు 15000 ఇస్తానని ఇది అమలు చేయలేదు పంట రుణాలను సగం మందికి ఇచ్చి చేతులు కౌలు రైతులకు రైతు హక్కులను గుర్తించి అమలు చేస్తానని చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కింది ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని ఏ ఒక్క చోట కూడా అమలు చేయలేదు పేదవాడికి వైద్యం అందించడంలో వైపర్యత చెందింది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 ప్రకటించింది అమలు చేయలేదు యువ వికాసం పేరిట విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల విద్యా భరోసా కార్డు భరోసా పథకాన్ని వెంటనే ప్రారంభించడంలో వైఫల్యత చెందింది రాజు ఆరోగ్యశ్రీ పథకం అంతట అమలు చేస్తానని చేసిన వాగ్దానాన్ని తుంగలో తొక్కింది అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంలో పూర్తి చెందింది ఆరు గారంటీలతోపాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఈ 6 గ్యారంటీ అమలుకై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ చలో హైదరాబాద్ ఈనెల 20న కదిలి రమ్మని ప్రజలకు పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించాం హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం కోరుతూ ఈనెల 11న వ్యక్తిగత దరఖాస్తుల తోని చర్ల ఎమ్మార్వో ఆఫీస్ కి కదిరావాల్సిందిగా ప్రజల్ని కోరారు.