మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.
ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి…
17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల ధర్నాకు సిపిఎం మద్దతు.
నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతి నిధి
వైరా :మిర్చి రైతులకు మార్కెట్ లో కనీస మద్దతు ధర కల్పించి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని అష్ట గుర్తు గ్రామంలో మిర్చి రైతుల కల్లాలో సిపిఎం నేతలు సుంకర సుధాకర్ తోము సుధాకర్ తో కలిసి పర్యటించారు. మిర్చి రైతులతో మాట్లాడి పెట్టిన పెట్టుబడి ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో సరైన రేటు లేక కల్లాలోనే మిర్చి ఉంచామని మద్దతు ధర లేకపోతే కుటుంబాల అప్పుల పాలై మరణాలే శరణం అని రైతు చిత్తారి వెంకటనర్సయ్య రామారావు లు బృందం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులను ఓదార్చారు. భూక్యా వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం మద్దతు ధర మిర్చి పంటకు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు వెంటనే చేయాలని కోరారు. ఈనెల 17న ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా సిపిఎం సంపూర్ణగా మద్దతు ఇస్తుందని తెలిపారు. మిర్చి రైతుల అధిక సంఖ్యలో పాల్గొని మిర్చి రైతుల ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు స్పందించకపోతే మిర్చి రైతుల పక్షాన పోరాడుతామని తెలిపారు.