నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి
వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది పురస్కరించుకొని పెద్దయెత్తున శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు.
బుధవారం వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైరా నియోజకవర్గ స్థాయి బంజారా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి అధికారికంగా నిర్వహించాలని సెలవు దినము గా ప్రకటించి గిరిజన పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం చాలా సంతోషకరం మనందరం మన నియోజకవర్గ స్థాయిలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించాలని నియోజకవర్గం ఐదు మండలాలు దశలవారీగా కార్యక్రమాలు నిర్వహించి బంజారా నాయకులతో పాటు మిగతా నాయక్ నాయకత్వాన్ని కూడా కలుపుకొని శ్రీ సంత్ సేవాలల్ గారి జయంతి ని ఒక పండగ వాతావరణం లాగా జరుపుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు సంబంధించిన బంజారా నాయకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వైరా మున్సిపల్ మాజీ చైర్మన్ సూతకాని జైపాల్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దాసరి దానియేలు, కట్ల రంగారావు, బోళ్ళ గంగారావు, సూరంపల్లి రామరావు, మంజిలాల్ నాయక్, పమ్మి అశోక్,కొప్పురావురి శబరినాథ్, మాజీ మార్కేట్ కమిటీ చైర్మెన్ బిడికె రత్నం, పాలేటి నరసింహరావు, రాంబాబు, నవీన్ రాథోడ్, లచ్చు నాయక్, రామ్మూర్తి నాయక్, గాంధీ నాయక్, భీముడు నాయక్, శంకర్ నాయక్, శీలం చంద్రశేఖర్ రెడ్డి, కట్ల సంతోష్, మాలోత్ రాందాస్ నాయక్, రామరావు, మాజీ ఎంపీటీసీ లచ్చిరాం నాయక్, తదితర బంజారా నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.