రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 7:- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు రామాయంపేట మండలం కేంద్రంలో మండల తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న తోటి మహిళా ఉద్యోగులు అందరు కలిసి తహసిల్దార్ రజనీకుమారి ని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళామణులు సాధించిన విజయాలను గుర్తించి,రేపటి రోజున మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.తాను రామాయంపేట మండల తహసిల్దారుగా 17 ఆగస్టు 2024న మొట్ట మొదటిసారిగా ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టినట్లు పేర్కొన్నారు.గత ఎనిమిది నెలలుగా తన కార్యాలయంలో 17 శాతం మహిళలు ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.సమాజంలో మహిళలను చిన్నచూపు చూడకుండా పురుషులతో సమానంగా మహిళలను గౌరవించాలని తెలిపారు.ఎలాంటి అపోహలకు గురికాకుండా పురుషులు మహిళల పట్ల తన సహోదరిగా భావించి గుర్తించాలని పేర్కొన్నారు.ఆరోజు నా కుటుంబం ఒక మహిళ అని చిన్నచూపు చూడకుండా నా వెన్నంటి ఉండి ఈరోజు వరకు ముందుకు నడిపిస్తేనే నేను ఒక బాధ్యత గల తహసిల్దార్ గా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు.అదేవిధంగా నా తోటి మండల సిబ్బంది మహిళలు ప్రజలకు అందించే సేవా కార్యక్రమాల్లో భాగంగా తనకు అన్ని విధాల కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.సమాజంలో మహిళలు ఎలాంటి మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు.ఈ సందర్భంగా మహిళలు మున్సిపాలిటీలో గ్రామాలల్లో అనారోగ్యాలకు గురికాకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఆమె వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మండల మహిళా ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.
