+91 95819 05907

కార్పెంటర్ల బంద్ పోస్టర్లు ఆవిష్కరణ

ఖమ్మం నగరంలో మూడు యూనియన్ల కార్పెంటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 17 సోమవారం నుండి 26 బుధవారం వరకు జరిగే “బందు” కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు . నగరంలో కార్పెంటర్ వృత్తిలో కొనసాగుతున్నటువంటి మేస్త్రీలు , గత కొంతకాలంగా ఎలాంటి ఎదుగూ , బొదుగూ లేకుండా ఉన్నారని , దీనికి కారణం వర్కర్ల రేట్లు విపరీతంగా పెరిగినవి , నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి . మన వృత్తికి సంబంధించిన మిషనరీ పరికరాల రేట్లు మనకు అందుబాటులో లేకుండా పెరిగాయి . మనం చేస్తున్నటువంటి పనికి సంబంధించిన మెటీరియల్ రేట్లు కూడా చుక్కల్లో ఉన్నాయి కానీ మనం యజమానుల దగ్గర మాత్రం ఎన్నో ఏండ్ల క్రితం ఉన్నటువంటి రేట్లతోనే కొనసాగుతున్నాం . కరోనా వచ్చిన దగ్గరినుండి చూస్తే ఇవాళ ప్రతీదానికీ రేట్లు పెరిగాయి కానీ మన వృత్తికి సంబంధించిన గత కొన్ని సంవత్సరాలుగా రేట్లు పెరగలేదు . పెరగకపోగా ఉన్న రేట్లనే ఇంకా తగ్గించి ఇస్తున్నారు . మెటీరియల్ కి ఎంత రేటైనా పెట్టి కొంటున్నారు . కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనకు సరైన రేటు ఇవ్వడం లేదు , ఇక్కడ మన శ్రమ ఎంత దోపిడీ జరుగుతుందో మనం గ్రహించి , ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కార్పెంటర్స్ సంఘాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి జె.ఎ.సి.గా ఏర్పడి మన వృత్తికి సంబంధించిన రేట్లని పెంచాలని కలిసికట్టుగా నిర్ణయించడం జరిగిందని , దాని పర్యవసానమే ఈ “బందు” కార్యక్రమం అని అన్నారు . దీనికి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మిక సోదరులు సైతం మద్దతిస్తున్నారు . ఇది చాలా మంచి పరిణామం . కావున మన అన్ని సంఘాల కలయికతో ఏర్పడినటువంటి ఈ జె.ఎ.సి. పిలుపునందుకుని ఖమ్మం నగరంలోని ప్రతీ కార్పెంటర్ సోదరుడు ఈ బందులో పాల్గొని జయప్రదం చేసి మన హక్కులను కాపాడుకుందాం , మన యొక్క వృత్తి రేట్లను పెంచుకుందాం , మన జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుందాం , మన కుటుంబాల ఉన్నతికీ , మన పిల్లల భవిష్యత్తు అభివృద్ధికి బాటలు వేసుకుందాం అని పిలుపునిచ్చారు . ఈ బందును ఉల్లంఘించిన వారికి రూ॥ 10,000/-లు వరకు జరిమానా తోపాటుగా తగు చర్యలు తీసుకొనబడును తెలిపారు . కార్పెంటర్స్ ఇబ్బందులు , బాధలు అర్థం చేసుకుని యజమానులు , బిల్డర్స్ మరియు తోటి కార్పెంటర్లు సహకరించాలని కోరారు . ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ యూనియన్ల జేఏసీ ఖమ్మం కన్వీనర్ బాణాల చిన్న వీరబ్రహ్మాచారి , కార్పెంటర్స్ అసోసియేషన్ ఖమ్మం అధ్యక్షులు బాణాల వీరబ్రహ్మాచారి , ప్రధాన కార్యదర్శి సోమా నాగరాజు కుమార్ , కార్పెంటర్ మేస్త్రీలు & వర్కర్స్ యూనియన్ ఖమ్మం అధ్యక్షులు దోనోజు పాపాచారి , ప్రధాన కార్యదర్శి దిగజర్ల వెంకన్న , ది ఖమ్మం నగర కార్పెంటర్స్ దూగోడ మిషన్స్ వర్కర్స్ యూనియన్స్ అధ్యక్షులు దోనోజు శ్రీనివాసాచారి , ప్రధాన కార్యదర్శి సండూరి నాగాచారి తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !