◆జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు వినతిపత్రం అందజేత.
వైరా:-నేటి గదర్ న్యూస్, మార్చి13:- వైరా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎండార్స్ చేసిన లెటర్ ను కలెక్టర్కు అందించారు.వైరాలో ముస్లింల కొరకు నిజాం కాలంలో (స్మశాన వాటిక) ఈద్గా పండుగ లకు ప్రార్థన చేసుకోవడానికి ఐదుఎకరాల స్థలం కేటాయించారని 1975 సంవత్సరంలో ముస్లిం జనాభా తక్కువ ఉండటం వలన అప్పటి జిల్లా కలెక్టర్ పార్థసారధి స్మశానవాటిక స్థలాన్ని ఫిషరీస్ కాలనీకి ఇచ్చారని వినతి పత్రంలో పేర్కొన్నారు. వైరా మున్సిపాలిటీగా ఏర్పడినందున అదేవిధంగా ముస్లిం జనాభా కూడా పెరిగిందని కావునా ఈద్గా పండుగలకు ప్రార్థన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్ అయిన తమరు దరఖాస్తు ను పరిశీలించి స్థలం కేటాయించాలని విన్నవించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి పరిశీలిస్తానని మసీద్ కమిటీ పెద్దలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ సొందు సాహెబ్, సయ్యద్ అన్వర్ మసీదు కమిటీ అధ్యక్షులు షేక్ రసూల్, షేక్ మీరా, షేక్ మీరా(కొండా) షేక్ రహిమాన్, గౌసుద్దీన్, సయ్యద్ అతావుల్లా, షేక్ గౌస్, రఫీ, తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.