+91 95819 05907

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన…ఇదే తెలంగాణ మోడల్ :సీఎం రేవంత్ రెడ్డి

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన.. కీలకమైన ఈ మూడింటి సమ్మళితమైన విధానం కొనసాగించడమే తెలంగాణ మాడల్ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. హైదరాబాద్ పోటీ ఇప్పుడు దేశంలోని ముంబై, బెంగుళూరు, ఢిల్లీ నగరాలతో కాదని, న్యూయార్క్, సియోల్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ అని చెప్పారు.

✳️ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో IndiaToday Conclave-25 లో పాల్గొన్నారు. ఈ వేదికపై ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ గారు, ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రీతి చౌదరి గారు అడిగిన అనేక సమకాలీన అంశాలపై రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన సమాధానాలిచ్చారు. గుజరాత్ రాష్ట్రానిది టెస్ట్ మ్యాచ్ మాడల్ అయితే, తెలంగాణది ట్వంటీ ట్వంటీ మాడల్ అని ఒక ప్రశ్నకు సమాధానంగా అభివర్ణించారు. అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు సమాధానంగా…

✳️ “30 వేల ఎకరాల్లో అంతర్జాతీయస్థాయి అత్యంత అద్భుతమైన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం. అయిదు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరాన్ని చూడండి.

✳️ హైదరాబాద్ నగరాన్ని ముంబై, బెంగుళూరు, ఢిల్లీతో పోల్చుకోవడం లేదు. న్యూయార్క్, సియోల్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్నాం. తెలంగాణ మాడల్‌తో ఎవరూ పోటీ పడలేరు. హైదరాబాద్ అభివృద్ధి ఒక్కరోజులో సాధ్యమైంది కాదు. కుతుబ్ షాహీ కాలం నుంచి ఈ నగరానికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి.

✳️ పెట్టుబడుల విషయంలో గుజరాత్ తరహాలోనే దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు మిగతా రాష్ట్రాలకు కూడా రాయితీలు ప్రకటించాలి. రాష్ట్ర ప్రజలు మాపై నమ్మకం ఉంచినందున రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై అడగటం మా బాధ్యత.

✳️ తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పులున్నాయి. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 69 కోట్లు మాత్రమే అప్పులుండేవి. ప్రస్తుతం తెలంగాణ ఆదాయం నెలకు 18,500 కోట్లు మాత్రమే. జీతాలకు, అప్పులపై అసలు వడ్డీలకే 13 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం కనీసం నెలకు 500 కోట్లు కేటాయించలేని పరిస్థితులున్నాయి. ఇలాంటి అంశాలపై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

✳️ 2026 లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడానికి ముందు అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలి. దీనిపై ముందు చర్చ జరగాలి. రాజకీయ కోణంలో దక్షిణాదికి నష్టం జరిగే నిర్ణయాలు సరికాదు.

✳️ దేశంలో కులగణన ఎందుకు జరగకూడదు. అందులో తప్పేముంది. బీసీల జనాభాను ఎందుకు లెక్కించకూడదు. ఎస్సీ, ఎస్టీ లెక్కలు తేల్చినట్టుగానే బీసీల గణాంకాలు సేకరించడంలో ఇబ్బందేంటి. వారి డిమాండ్ సమంజసమైనప్పుడు బీసీ జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు కల్పించడంలో తప్పేముంది. ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఓబీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు.

✳️ హిందీ నేర్చుకోవడమన్నది ఒక ఐచ్చికంగా మాత్రమే ఉండాలి. బలవంతంగా రుద్దకూడదు. కాలేజీల్లో ఫ్రెంచ్, జర్మనీ వంటి ఎన్నో భాషలు ఉన్నాయి. ఎవరికి ఏదిష్టముంటే దాన్ని నేర్చుకుంటారు. హిందీని నేర్చుకోవడాన్ని వ్యతిరేకించడం లేదు. బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించవద్దనేదే మా అభిప్రాయం. హిందీ నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందంటే నేర్చుకుంటారు.

✳️ హైదరాబాద్ వేదికగా ఒలంపిక్ క్రీడలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీ గారికి విజ్ఞప్తి చేశాం. క్రీడలకు హైదరాబాద్ ఒక మంచి కేంద్రం. ప్రపంచ మిలటరీ గేమ్స్, నేషనల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ హైదరాబాద్‌లో నిర్వహించాం. ఎంతో మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులు తెలంగాణ నుంచి ఉన్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఏది ఉత్తమమైన నగరమో అంతర్జాతీయ ఒలింపిక్ అసోషియేషన్ నిర్ణయించాలి.” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆ వలస ఆదివాసి గ్రామంలో టీవీ యాంకర్లు సందడి చేశారు.మన గ్రోమోర్ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం

నేటి గదర్ న్యూస్,పినపాక: మండలంలోని గ్రామపంచాయతీ లోని తిల్లాపురం ఆదివాసి గ్రామంలో బిగ్ ఫేమస్ ఆర్టిస్టులు గీత రాయల్ శ్రీ సత్య పవిత్ర యాంకర్ అనిల్ జిలా గురువారం పర్యటించారు. మన గ్రోమోర్ ఆధ్వర్యంలో

Read More »

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

 Don't Miss this News !