+91 95819 05907

ఉద్యోగులు బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

– ఉద్యోగులు బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదు.

– పదివేల కోట్ల పెండింగ్ బిల్స్ క్లియర్ చేశాం.

– మిగిలిన పెండింగ్ బిల్స్ త్వరితగతిని చెల్లిస్తాం.

– ఉద్యోగుల జేఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

ప్రభుత్వ ఉద్యోగులు వారి బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదని,
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పదివేల కోట్ల బకాయిలను చెల్లించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా పనిచేసిన ఉద్యోగులు దాచుకున్న డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను అర్థం చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఐదు వేల కోట్ల బిల్స్ పెండింగ్లో పెట్టి వెళ్లిందని, గత 14 నెలల కాలంలో కొంత బకాయిలు జమ అయ్యాయని వివరించారు. పాత, కొత్త పెండింగ్ బిల్స్ 10,000 కోట్లు తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని తెలిపారు. మరో ఎనిమిది వేల కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయి అని వివరించారు. రానున్న ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రతినెల 500 నుంచి 600 కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన వారి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నెలలో ఏ తేదీలో జీతాలు పడతాయో అర్థం కాని పరిస్థితి ఉండేదని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల క్రమం తప్పకుండా ఒకటో తారీఖున జీతభత్యాలు చెల్లిస్తున్నామని, రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది (ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్) సిబ్బంది ఉన్నారని తెలిపారు. కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ తదితర బిల్లును మాత్రమే పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత త్వరలో క్లియర్ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అర్ధికేతర సమస్యలు పరిష్కరించడానికి వివిధ క్యాబినెట్ సభ్యులు ఉన్నాయని ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. తమది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్, గెజిటెడ్, వివిధ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, మున్సిపల్, వైద్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

3వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

నిరంతరంగా మూడోరోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎం.ఎఫ్ నాయకులు పార్శపు ఏనూక మాదిగ నేటి గదర్ న్యూస్, మార్చి 13. మధిర కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మహాజననేత

Read More »

ఆ వలస ఆదివాసి గ్రామంలో టీవీ యాంకర్లు సందడి చేశారు.మన గ్రోమోర్ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం

నేటి గదర్ న్యూస్,పినపాక: మండలంలోని గ్రామపంచాయతీ లోని తిల్లాపురం ఆదివాసి గ్రామంలో బిగ్ ఫేమస్ ఆర్టిస్టులు గీత రాయల్ శ్రీ సత్య పవిత్ర యాంకర్ అనిల్ జిలా గురువారం పర్యటించారు. మన గ్రోమోర్ ఆధ్వర్యంలో

Read More »

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

 Don't Miss this News !