నీటి గద్దర్ డిజిటల్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, వారికి ఆర్థిక, సామాజిక, సాంకేతిక స్థాయిలో సాధికారత కల్పించేలా అనేక పథకాలను అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిప్యూటీ సీఎం మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలుపుతూ తమ ప్రభుత్వం మహిళా సాధికారికత కొరకు అమలు చేస్తున్న పథకాలను వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు తయారు చేయడమే తమ లక్ష్యం అన్నారు. డిప్యూటీ సీఎం కామెంట్స్ ఇవే.
మహిళల సంక్షేమానికి, భవిష్యత్తు బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన చర్యలు:
*ఉచిత బస్సు ప్రయాణం* – మహిళలు ఏ మూలనికైనా ఆర్థిక భారం లేకుండా ప్రయాణించేందుకు వీలు.
*మహాలక్ష్మి పథకం* – ప్రతి గృహిణికి కేవలం ₹500కే గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి.
*గృహ జ్యోతి పథకం* – 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కరెంటు బిల్లుల భారం తగ్గించేందుకు.
*మహిళా సమస్యల పరిష్కారానికి RTC బస్సులు* – మహిళలు తక్షణ సహాయం పొందేందుకు ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి.
*ఇందిమ్మ ఇల్లు* – మహిళల పేరుతో గృహ మంజూరు, సొంత ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యం.
*స్వయం ఉపాధి కోసం పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు –* మహిళా సమైక్యలకు ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక ప్రణాళిక.
*త్వరలో 14000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం* – మహిళలకు ఉపాధి అవకాశాలు, చిన్నారులకు మెరుగైన సేవలు.
*ఇంద్రమ్మ డైరీ (బోనకల్ మండలం)* – మహిళల ఆర్థిక స్థిరత్వానికి పాల ఉత్పత్తి ఆధారంగా ప్రత్యేక డైరీ వ్యవస్థ.
మహిళా శక్తి క్యాంటీన్లు- తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్యాంటీన్ల ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.
ఈ మహిళా దినోత్సవం, సమాజ నిర్మాణంలో మహిళల పాత్రను గుర్తు చేసే అదృష్టమైన రోజు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మీ అభివృద్ధికి అండగా ఉంటుంది