మహాత్మా సావిత్రిభాయి ఫులే ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకోవాలి…
సిఐటియు,ఐద్వా నాయకులు
నూతి శైలజా,తోట పద్మ
మణుగూరు మార్చి 8: మణుగూరు శ్రామిక భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సిఐటియు,ఐద్వా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.ముందుగా మహాత్మ సావిత్రిబాయి పూలే,చాకలి ఐలమ్మ,మల్లు స్వరాజ్యం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నిర్వహించిన సదస్సులో సిఐటియు,ఐద్వా నాయకులు నూతి శైలజా,తోట పద్మ లు మాట్లాడుతూ,నవభారత నిర్మాణంలో మహిళలు విద్యావంతులుగా ఎదగాలని మహాత్మ సావిత్రిబాయి పూలే ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ఎదిగే శక్తిగా మారాలని అనేక విజయాలను సాధించి నవభారత నిర్మాణంలో మహిళలు విద్యావంతులుగా ఎదగాలని వారన్నారు.మహాత్మ సావిత్రిబాయి పూలే ఈ దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఎదిగి బ్రాహ్మణ సమాజాన్ని ఎదిరించి అణగారిన మహిళలకు చదువు నేర్పించి గొప్ప మహాత్మురాలుగా నిలిచిన మహోన్నతమైన శక్తిగా ఎదిగి ఈరోజు మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. మహిళ మాతృమూర్తులు అందులేరు ఇందులేరు అనే సందేహంబు లేదు ఎందెందు వెతికిన అందందు కలరు అన్నట్లుగా మహిళలు నాటు వేసే దగ్గర నుండి నావి నడిపే వరకు ఎయిర్ పోర్టు నుండి ఎవరెస్టు వరకు మహిళలు దూసుకు వెళ్ళుతూ,ఏ రంగంలో చూసిన మహిళలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నా,నేటికి మహిళల మీద దాడులు రోజురోజుకు పెచ్చరిల్లుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు రక్షణ కరువైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు మానభంగాలు,అత్యాచారాలు భ్రూణ హత్యలు జరుగుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ సంఘాల ఆధ్వర్యంలో ఐక్య పోరాటాలను నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు పిట్టల నాగమణి,గిరిజన సంఘం మండల అధ్యక్షురాలు కొండ్రు గౌరీ, బత్తుల రమాదేవి,జల్లా జయ,కౌశల్య,శ్రీలత కారం నాగేంద్ర, మడకం అరుణ,బోడ నాగలక్ష్మి,నరసమ్మ, సరిత,విజయ,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.