జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 14న పిఠాపురంలో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయండి.
జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మిరియాల రామకృష్ణ.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈనెల 14న జనసేన పార్టీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఊరైన పిఠాపురంలో జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరిగే ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ ఆనాడు శ్రీ పవన్ కళ్యాణ్ ఎలాంటి సిద్ధాంతంతో పార్టీని స్థాపించారో నేటికీ కట్టుబడి అదేవిధంగా ఉందని , పార్టీ స్థాపించిన నాటి నుండి తనదైన శైలిలో ప్రజా గలాన్ని వినిపిస్తూ సమస్య పరిష్కారం కోసం ప్రశ్నిస్తూ పరిష్కార మార్గం చూపెట్టడం జరిగిందని ఆనాటి పరిస్థితుల వల్ల ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన , వెనకడుగు వేయక విజయం అంటే ఇలా ఉండాలి అని దేశ ప్రజలు తన వైపు చూసేలా జనసేన పార్టీన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు . అవినీతి పరిపాలనకు ఆమడ దూరం ఉంటూ, ఆదర్శ పరిపాలన అందిస్తున్నాడు. అలాంటి నాయకుడు వెనక నేను నడుస్తూ , ప్రజలకు సేవ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను . నాలాంటి నాయకులతో పాటు , ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ , మంచి పరిపాలన అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ యువత పట్ల అదేవిధంగా తెలంగాణ ప్రజానీకం పట్ల అవసరమైన సందర్భంలో తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటారు . పలు సందర్భంలో తెలంగాణరాష్ట్ర ఉద్యమం తణుకు స్ఫూర్తిని ఇచ్చిందని తన భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది . తెలంగాణ ప్రాంతంలో వరదలు వచ్చిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించి ఇవ్వటం జరిగింది . తెలంగాణ సమస్యలపై తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు దిశా నిర్దేశం చేయడం కూడా జరిగింది . తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండాలని , ప్రతి సమస్యపై పోరాడాలని , నియోజకవర్గ ఇన్చార్జులను ప్రకటించడమే కాక గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సైతం కొన్ని నియోజకవర్గాలో అతి సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన యువతను ఎమ్మెల్యే అభ్యర్థులను నిలపడం జరిగింది . యువతను ప్రోత్సహించడంలో అధినేత పవన్ కళ్యాణ్ గారికి యువత పట్ల ఉన్న మక్కువ అర్థం అవుతుంది . నాలాంటి యువతను ప్రోత్సహించిన పార్టీ జనసేన పార్టీ అని మిర్యాల రామకృష్ణ తెలియజేశారు . ఆవిర్భావ సభకు ఖమ్మం అసెంబ్లీ జనసేన పార్టీ శ్రేణులు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొని అధినేత ఇచ్చే సందేశాన్ని నిశితంగా గమనించి ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మిరియాల జగన్మోహన్ , బండారు రామకృష్ణ , ఖమ్మం నగర అధ్యక్షులు మేడాబోయిన కార్తీక్ , ఉపాధ్యక్షులు బానోతు దేవేందర్ , తుడుముత్తం రాజ్ , పుల్లారావు , రమణ , అఖిల్ , రచ్చ నాగరాజు , వంశీ , నాగేశ్వరావు , జనసేన పార్టీ నాయకులు , వీర మహిళ విభాగ అధ్యక్షులు షేక్ హసీనా , విద్యార్థి విభాగ నాయకులు విజయ్ మరియు జన సైనికులు పాల్గొన్నారు .