చెత్తాచెదారాన్ని సేకరిస్తారు గ్రామాల ప్రజలు ఎటువంటి రోగాల బారిన పడకుండా సేవ చేసే మహిళా కార్మికులకు మరొక్కసారి వందనం.
నేటిగదర్ న్యూస్,వైరా ప్రతినిధి(జూలూరుపాడు) మార్చ్8:- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండలంలో ఉన్న 24 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న మహిళ పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిగాని రాజ్, నేషనల్ మహిళా అధ్యక్షురాలు అంజలి రెడ్డి , వారి సహకారంతో మండల హెడ్ క్వార్టర్ లో మహిళా పారిశుద్ధ్య కార్మికుల ఆధ్వర్యంలో కేకును కట్ చేసి పారిశుద్ధ్య మహిళ కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించి అనంతరం చీరలు మాస్కులు పంపిణీ చేసి ఇదే కార్యక్రమంలో తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ ఎంతటి వర్షమైనా,ఎముకలు కొరికే చలి అయిన,ఎంతటి ఎండ తీవ్రంగా ఉన్న మండల ప్రజల ఆరోగ్యం ఉండాలని ప్రతి రోజు బజారు,బజార్ను ఊడ్చుతూ ఇంటింటికి తిరిగి చెత్త ను సేకరిస్తూ వచ్చేటటువంటి జీవితం సరిపోయిన సరిపోకపోయినా సర్దుకుపోతూ సేవ చేసేటటువంటి గొప్ప కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే అది గ్రామపంచాయతీ పారిశుద్ధ్య మహిళా కార్మికులే ఆయన అన్నారు.అదే కాకుండా డ్రైనేజీలు శుభ్రపరచడం మొక్కలను నాటి మొక్కలకు నీరు అందించుతూ వాటిని సంరక్షించడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన పనులను వారు చేస్తూ పంచాయతీ ప్రజలకు సేవ చేసేటటువంటి మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వారి సహకారంతో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య మహిళా కార్మికులను సన్మానించడం ఆనందంగా ఉందని వారు తెలియజేశారు.
కార్యక్రమంలో మహిళా కార్మికులు లక్ష్మీ,సునీత, సుజాత,కళావతి,నాగమణి, రమణ తదితరులు పాల్గొన్నారు.