అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 08: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశాలలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు వేడుకలకు మాత్రమే పరిమితం కాదని మహిళల హక్కులను గుర్తిస్తూ వారు సాధించిన విజయాలను తెలియచేశారు, మహిళలు ఎంతో మార్పు చెందిన ఈ ఆధునిక ప్రపంచంలో కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ అభివృద్ధికి తమ పాత్ర పోషిస్తూ కేంద్రబిందువులుగా నిలుస్తున్నారన్నారు. చరిత్రను పరిశీలిస్తే రాణి రుద్రమదేవి, సావిత్రీబాయి ఫూలే, ఇందిరాగాంధీ లాంటి అనేకమంది తమ ప్రతిభతో ధైర్యసాహసాలతో అంకితభావంతో ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధి కోసం వారు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం అవ్వడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని తెలిపారు
మహిళలకు సమాన అవకాశాలు అందిస్తూ ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. మహిళల భద్రతను పరిరక్షిస్తూ మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా జీవించే సమాజాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈసందర్భంగా తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల మహిళా కమిటీ సభ్యులను గ్రామ మహిళా కమిటీ సభ్యులను మహిళా ఉద్యోగులు ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్, పణి, బాబి, నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.