వాహనాలను తనిఖీ చేసిన ఎస్సై రాజశేఖర్.
ములకలపల్లి. నేటి గద్దర్ న్యూస్. ములకలపల్లి స్టేషన్ పరిధిలో స్థానిక ఎస్సై కిన్నెర రాజశేఖర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు,డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు . ఈ సందర్భంగా పలు వాహనాల యొక్క కాగితాలను పరిశీలించారు. వాహనాలతప్రయాణం చేసేవారు అన్ని రకాల ధ్రువపత్రాలను కలిగి ఉండాలని, వాహనాలు నడిపేవారు మద్యం తాగి డ్రైవింగ్ చెయ్యవద్దని, ద్విచక్ర వాహనాలపై గాని, కార్లలో ప్రయాణించేవారు వేగంతో వాహనాలు నడపవద్దని తెలియజేశారు. ఈ తనిఖీల్లో స్థానిక ఎస్సై రాజ్ కుమార్ తో పాటు,స్థానిక స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 121