– మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు.
– కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డి, విజయ దంపతులు.
– వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఘన సన్మానం.
–
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం : మహిళలు ప్రతి అంశంలోనూ స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ముందుకు సాగాలని,
ఇంటా…బయట అన్నింటా జగమంతా మగువే కీలకమని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు కొంగర జ్యోతిర్మయి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు చెందిన వివిధ వర్గాల మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన దయాకర్ రెడ్డి విజయ దంపతులు కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తూ…. సమాజ సేవకు తను వంతు పాటుపడుతున్న మహిళలను ఓబీసీ మహిళా వైస్ చైర్మన్ హారిక నాయుడు, ఇతర మహిళలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కర్లపూడి భద్రకాళి, జ్యోతి, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సరోజిని, కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్లు దామా స్వరూప, కీసర పద్మజా రెడ్డి, శ్రీ కళా రెడ్డి, తాళ్లూరి జ్యోతి, అమ్మ ఆశ్రమ నిర్వాహకురాలు మంజుల, పంచాయతీ సెక్రటరీ రాధా రాణి, తిరుపతమ్మ, రమాదేవి, ఇటికాల లత, రుడావత్ రమాదేవి, మాజీ సర్పంచ్ మౌనిక, శ్రావణి, సమీరా తదితరులు పాల్గొన్నారు.