ఖమ్మం : గోశాల టేకులపల్లి
కొలిచలం బ్రహ్మయ్య నివాసం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ , కుమ్మర మొల్ల జయంతిని పురస్కరించుకొని కుమ్మర మొల్ల ప్రతిభా పురస్కారాలు “ను కొలిచలం బ్రహ్మయ్య – విజయ సహకారంతో కొలిచలం గీత అధ్యక్షతన నిర్వహించడం జరిగింది . ఖమ్మం జిల్లా కుమ్మర , శాలివాహన ప్రజాపతి , మహిళల ప్రతిభను గుర్తించి ప్రతిభా పురస్కారాలను అందజేసి సన్మానించడం జరిగింది . మహిళా మణులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకొని మహిళలు మాట్లాడుతూ సృష్టికి మూలం , శక్తికి రూపం , త్యాగానికి ప్రతిరూపం , సహనానికి నిదర్శనం , ప్రేమానురాగాలకు పర్యాయపదం స్త్రీ , స్త్రీ ని గౌరవించబడినప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది . ఆ దేశం బాగుంటుంది . కాబట్టి మహిళా దినోత్సవం ని ఒక పండగ వాతావరణంలా నిర్వహించి మహిళలను గౌరవించాలి అని వారిని వారికి సమాన అవకాశాలను కల్పించాలని మహిళలు మాట్లాడటం జరిగింది . ఈ కార్యక్రమంలో కొలచలం గీత , కొలిచలం విజయ , విలాసాగరం రమాదేవి , రాధ , కవిత , నాగమణి , ఝాన్సీ , రాజేశ్వరి , కల్పన , యశోద , ఉష , విజయలక్ష్మి , స్వరూప , వెంకటలక్ష్మి , అనిత , అనసూర్య , నాగమ్మ , ఉమ , చిట్టెమ్మ , సత్యాప్రియ , సుహాసిని తదితర మహిళలు పాల్గున్నారు .
