రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 9:- పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదించాలని మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారం రామాయంపేట పట్టణంలో తెలిపారు.గత 75 సంవత్సరాల నుండి పార్లమెంటులో గాని అసెంబ్లీలో గాని బీసీలకు స్థానం లేకుండా చేస్తున్నారని ఇద ప్రజాస్వామ్యం అసలైన ప్రజాస్వామ్యం రావాలంటే ప్రజలకు న్యాయం జరగాలంటే బీసీలకు వాటా మేం ఎంతో మాకు అంత వాటా దక్కినప్పుడే నిజమైన స్వతంత్రం న్యాయమైన స్వతంత్రం అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో గత 75 సంవత్సరాల నుండి బీసీ మహిళలు కేవలం ఎనిమిది మందికి మాత్రమే అసెంబ్లీలో స్థానం దక్కింది.మరి ఈ 75 సంవత్సరాలలో బీసీ మహిళలకు 8 మందికి మాత్రమే అవకాశం వచ్చినప్పుడు మరి ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.అందుకే మహిళా బిల్లు వద్దు బీసీ బిల్లు పెట్టి పార్లమెంటులో ఆమోదించి బీసీ మహిళలకు బీసీ సమాజానికి సముచిత స్థానం దక్కేలా చూడాలని కోరారు.
