రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 9 :- మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఆదివారం నాడు గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. మండల కేంద్రానికి చెందిన మైలారం సిద్ధిరాములు అనే ఇంట్లో గ్యాస్ సిలిండర్ లిక్ కావడంతో భారీగా మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది.ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.ప్రమాదం తప్పింది స్థానికుల సమాచారముతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. ఇల్లు ఇంట్లోని సామాగ్రిని పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు.సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు
Post Views: 63