రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 10:- రక్తదానం,అవయవదానం అనే రెండు దానములు నేటి పరిస్థితుల్లో సమాజంలో అవసరము ఉన్నవారికి సరియైన సమయంలో దొరకనట్లయితే అపాయకరమని లయన్స్ క్లబ్స్ ఇంటర్ నేషనల్ జిల్లా 320 డి గవర్నర్ పంపాటి నగేష్ అన్నారు.రాగి కన్వెన్షన్,హైదరాబాద్ లో సాయంత్రం జరిగిన లయన్స్ జిల్లా 320-డి 19వ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ లో రామాయంపేట లయన్స్ క్లబ్ చార్టర్ సభ్యులు లయన్ డా.ఏలేటి రాజశేఖర్ రెడ్డి రూపొందించిన తన 18వ రక్త,అవయవ దాన ప్రచార గోడపత్రిక ను విడుదల చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా రక్త అవయవ దాన ప్రచారానికై తీవ్ర కృషి చేస్తున్నట్లు,దానివల్ల లయన్స్ జిల్లా 320-డిలో విస్తృతంగా రక్తదాన శిబిరములను నిర్వహించినట్లు తెలిపారు.అలాగే అవయవదానం కూడా చాలా ప్రాముఖ్యతను పొందిందని,ఎంత ప్రచారం నిర్వహించిన కూడ దాతలు ముందుకు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు.లయన్స్ తమ తమ క్లబ్ ల ద్వారా రక్త,అవయవ దానాలకు విస్తృత ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు, ఏరియా గాట్ లీడర్ ఆర్.సునీల్ కుమార్ తో పాటు ఇతర లయన్స్ నాయకులు లయన్ ఏ.అమర్నాథ్ రావు గవర్నర్ ఎలెక్ట్ లయన్ ఎం.విజయలక్ష్మి ఫస్ట్ వైస్ గవర్నర్ ఎలెక్ట్ ,లయన్ డిచిపల్లి నరసింహ రాజు సెకండ్ వైస్ గవర్నర్ ఎలెక్ట్,లయన్ కె.సూర్యనారాయణ జిఎల్టి ఎక్స్టెన్షన్ లీడర్ మరియు ఇతర లయన్స్ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
