రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 10:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఎస్సీ కాలనీలో గత బుధవారం రాత్రి ఊట్ల విజయ్ తండ్రి రాజయ్య గుండెపోటుతో మరణించాడు.ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు మెదక్ నియోజకవర్గం ఇంచార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి సోమవారం నాడు రామాయంపేట బిఆర్ఎస్ మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారిని ఓదార్చి వారి కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.అదే విదంగా ఏడవ వార్డు మాజీ కౌన్సిలర్ మల్యాల కిషన్ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్యాల కిషన్ టంకరి పెద్ద స్వామి,సిద్ధం భిక్షపతి,ఓద్ది స్వామి,బైరం నర్సింలు,పాతూరి సిద్ధ రాములు,ఎర్ర రాములు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 97