హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 10.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నామన్నారు. మెదక్ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆ ఏడుకొండల స్వామిని కోరుకున్నానని వెల్లడించారు. వీరి వెంట కుమారుడు పునీత్ రెడ్డి, కోడలు దీపిక రెడ్డి, చెల్లెలు అనిత రెడ్డి, వియ్యంకురాలు, వియ్యంకుడు
లక్ష్మి,భాస్కర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Post Views: 30