+91 95819 05907

మెదక్ నియోజక వర్గంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు

– అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.
– భవన నిర్మాణం కోసం 20-25 ఎకరాల భూ సేకరణకు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు.
– మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

మెదక్ జిల్లా న్యూస్ నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి) భూపాల్ మార్చి10.

మెదక్ నియోజక వర్గంలో 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయినట్లు మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహత్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కోన్నారు. మెదక్ జిల్లా అబివృద్దిలో భాగంగా రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రత్యేకంగా మాట్లాడి నియోజక వర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కోసం దాదాపు 200 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించినట్లు ఆయన పేర్కోన్నారు. ఈ యొక్క భవన నిర్మాణంను 20-25 ఎకరాల స్థలంలో నిర్మించనున్నట్లు పేర్కోన్నారు. 20-25 ఎకరాల స్థలం కోసం జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కోన్నారు. అదే విధంగా విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్స్ డెవలప్ మెంట్స్ ఎంతగానో ఉపయోగకరం అని ఆయన అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్స్ వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి స్కూల్స్ దేశంలో ఎక్కడా లేవన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో స్కూళ్లను నిర్మిస్తామని, టీచింగ్ స్టాఫ్‌ కూడా అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉండబోనున్నాయన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో డిజిటల్ పాఠాలు ఉంటాయని పేర్కోన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలో చదవలేని పిల్లలకు..కార్పొరేట్ స్థాయి వసతులతో విద్య అందిస్తామని పేర్కోన్నారు. రాష్ట్ర విద్యారంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయమని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కోసమే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసకుందని ఆయన పేర్కోన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పశువుల పాకల్లో పాఠశాలలు ఏర్పాటు చేసిందని ఆయన విమర్శించారు. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కోన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా

Read More »

హొలీ సందర్భంగా హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ సూచన ఇదే

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: రంగుల ఖేలి హోళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. హోలీ పండుగ సందర్భంగా పేర్కొన్న నిషేధాలు అమలులో ఉంటాయన్నారు. 2025 మార్చి

Read More »

రక్త దాన శిబిరం విజయవంతం

*శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారు మెగా సర్వీస్ క్యాంప్ తో పాటు భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ వారితో రక్త దాన శిబిరం విజయవంతం* భద్రాద్రి కొత్తగూడెం

Read More »

ఆత్కూరు నుండి మధిర, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గదర్ న్యూస్, మార్చి 12 మధిర నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు

Read More »

 Don't Miss this News !